Mumbai Drugs : ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు…ఎన్సీబీ విచారణలో కీలక విషయాలు

బాలీవుడ్ టు హాలీవుడ్.. ముంబై క్రూయిజ్ షిప్‌ డ్రగ్స్ దందాలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. మొత్తం 19 మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. విచారణలో కీలక విషయాలు రాబట్టింది.

Mumbai Drugs : ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు…ఎన్సీబీ విచారణలో కీలక విషయాలు

Mumbai Drugs Case

Mumbai Cruise Ship Drugs Case : బాలీవుడ్ టు హాలీవుడ్.. డ్రగ్స్ దందాలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. అక్టోబర్ రెండో తేదీన.. ముంబై సముద్రంలో క్రూయిజ్ షిప్‌పై రెయిడ్ చేసి.. నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎన్సీబీ.. రేవ్ పార్టీ కేసులో తీగ లాగేస్తోంది. మొత్తం 19మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. విచారణలో కీలక విషయాలు రాబట్టింది. బాలీవుడ్ నటులకు ఉన్న లింక్స్.. షిప్‌లోకి డ్రగ్స్ ఎలా తీసుకెళ్లారనే విషయాలపై కూపీ లాగింది.

ఆర్యన్ ఖాన్, అర్బాజ్ ఇతర నిందితులను విచారిస్తున్న టైంలో… మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటకొచ్చాయి. నిందితులకు హాలీవుడ్ నటులతో కూడా లింక్ ఉన్నట్లు తేలింది. ఆర్యన్, అర్బాజ్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన సప్లయర్‌ శ్రేయాస్ నాయర్‌ను విచారించిన సమయంలో కీలక విషయాలు తెలిసాయి. అంతే కాకుండా.. మొత్తం 19మందిని ప్రశ్నిస్తున్న టైంలో.. నిందితులకు టాలీవుడ్ నటులతో ఉన్న లింకులు వెలుగులోకి వచ్చాయి.

Commander Talk : భారత్ – చైనా, అసంపూర్తిగా 13వ విడత చర్చలు

బాలీవుడ్ నటులకు డ్రగ్స్ సరఫరా చేసిన నిందితులు.. హాలీవుడ్ రేంజ్‌లో నెట్ వర్క్ మెయిన్‌టేన్ చేస్తున్నట్లు తేలింది. నిందితుల ఫోన్లు పరిశీలించిన అధికారులు… అందులోని చాట్‌లలో హాలీవుడ్ నటుల మొబైల్ నెంబర్లను ట్రేస్ చేశారు. వారితో కోడ్ వర్డ్స్‌లో చాట్ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా.. విదేశాల్లో ఎక్కడైనా డ్రగ్స్ అందిస్తామని నిందితులు హాలీవుడ్ నటులకు హామీ ఇచ్చినట్లు ఎన్సీబీ క్రాక్ చేసింది. హాలీవుడ్ నటులకు కూడా డ్రగ్స్ సరఫరా చేసే స్థాయిలో సప్లయరున్నారంటే.. ఏ రేంజ్‌లో బిజినెస్ జరుగుతోందా అని ఎన్సీబీ కూపీ లాగుతోంది.

ఇక.. బాలీవుడ్‌లో కొందరు నటులు.. వారి ఫ్యామిలీ మెంబర్ల ఫోన్ నెంబర్లను కూడా నిందితుల చాటింగ్ లిస్ట్‌లో ఎన్సీబీ గుర్తించింది. వారితో ఏం చాట్ చేశారు. డ్రగ్స్ సరఫరా అంశాలపై ఏమైనా చాటింగ్ జరిగిందా అనే కోణంలో ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇక.. ఆర్యన్ ఖాన్‌ బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది. దీంతో.. ఇవాళ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆర్యన్‌ఖాన్‌తోపాటు… మరో ఏడుగురు ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలోనే ఉన్నారు.

Kashmir Encounter : రాజౌరి సెక్టార్ లో ఎదురుకాల్పులు..నలుగురు జవాన్లు వీరమరణం

ఇక డ్రగ్స్‌ సరఫరాకు మత్తు మాఫియా కొత్త దారులు వెతుకుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్ని రకాలుగా అడ్డుకుంటున్నా.. ముఠా సభ్యులు వివిధ రకాలుగా డ్రగ్స్‌ సరఫరా చేస్తూనే ఉన్నారు. ముంబై క్రూయిజ్‌ నౌకలో జరిగిన రేవ్‌పార్టీలో ఓ మహిళా నిందితురాలు శానిటరీ న్యాప్‌కిన్‌లో డ్రగ్స్‌ తీసుకెళ్లినట్టు తేలింది. ఆమె నుంచి ఐదు గ్రాముల డ్రగ్స్‌ను నార్కొటిక్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

ముంబై డ్రగ్స్‌ కేసులో దూకుడుగా వెళ్తున్న అధికారులు.. ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న వారిని విచారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్యన్‌ఖాన్‌ కారు డ్రైవర్‌ను ప్రశ్నించారు. మరోవైపు ఇవాళ విచారణకు ప్రొడ్యూసర్‌ ఇంతియాజ్‌ ఖత్రీకి ఎన్‌సీబీ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఆయనకు ఎన్‌సీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.