Cruise Drugs Case : ఆర్యన్‌కు షరతులు ఇవే!

బెయిల్ కు సంబంధించిన పూర్తిస్థాయి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆర్యన్ ఖాన్ కు 14 షరతులు విధించింది.

Cruise Drugs Case : ఆర్యన్‌కు షరతులు ఇవే!

Aryan Khan

Aryan Khan Bail Conditions : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ విడుదలలో జాప్యం జరుగుతోంది. బెయిల్ కు సంబంధించిన పత్రాలు సకాలంలో జైలు అధికారులకు అందలేదని సమాచారం. దీంతో ఆర్యన్ ఖాన్ ఈ రాత్రికి కూడా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడనుందని తెలుస్తోంది. బెయిల్ కు సంబంధించిన పూర్తిస్థాయి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆర్యన్ ఖాన్ కు 14 షరతులు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పనులన్నీ పూర్తి చేసిన అనంతరమే..ఆర్యన్ జైలు అధికారులు విడుదల చేయనున్నారు. అక్టోబర్ 03వ తేదీన డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. 24 రోజుల పాటు జైలులో అతను ఉన్నాడు.

Read More : SRK Son Aryan Khan : ఆర్యన్ ఖాన్ రేపు విడుదల..రాత్రి జైల్లోనే

1. ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. 2. దేశం విడిచి వెళ్లాలంటే..ముంబైలోని ఎన్ డీపీఎస్ ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి. 3. లక్ష వ్యక్తిగత బాండ్ చెల్లించాలి. NDPS కోర్టు వద్ద పాస్ పోర్టును సరెండర్ చేయాలి. 4. డ్రగ్స్ కార్యకలాపాల్లో పాల్గొనరాదు. 5. గ్రేటర్ ముంబై దాటి వెళ్లాలంటే…మాత్రం దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వాలి. అందులో ఎక్కడకు వెళుతున్నారో పూర్తి వివరాలు సమర్పించాలి. 6. ఈ కేసు విచారణలో ఎలాంటి ఆటంకం కలగించకూడదు. 7. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న తన ఫ్రెండ్ అర్బాజ్ తో పాటు ఇతర నిందితులతో ఎట్లాంటి పరిస్థితుల్లో మాట్లాడకూడదు.

Read More :PF ఖాతాదారులకు కేంద్రం దీపావళి కానుక… 8.5శాతం వడ్డీకి ఆమోదం

8. ఈ కేసులో సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించవద్దు. 9. ఈ కేసుకు సంబంధించిన విషయాలపై మీడియాతో మాట్లాడవద్దు. 10. కేసు విచారణనను ఆలస్యం చేసేలా ప్రవర్తించకూడదు. 11. ప్రతి శుక్రవారం NCB కార్యాలయంలో ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 2 గంటల మధ్య హాజరు కావాల్సి ఉంటుంది. 12. ఎన్ సీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లాలి. 13. కోర్టు విచారణకు అన్ని తేదీల్లోనూ హాజరు కావాల్సి ఉంటుంది. 14. ఈ షరతులను ఉల్లంఘిస్తే…బెయిల్ రద్దు చేయాలంటూ…కోర్టును ఎన్ సీబీ అధికారులు ఆశ్రయించవచ్చు.