భారత్ లో పెరుగుతున్న కొత్త రకం కరోనా కేసులు

India detects total 71 cases of the new Covid-19 strain first seen in UK యూకేలో తొలిసాకిగా వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్..ఇప్పుడు భారత్ ను కూడా భయపెడుతోంది. భారత్ లో కూడా కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో కొత్త కరోనా వైరస్​ స్ట్రెయిన్​ కేసుల సంఖ్య 71కి చేరినట్లు బుధవారం(జనవరి-6,2021)కేంద్రఆరోగ్యశాఖ ప్రకటించింది.

బాధితులందరూ..ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఆరోగ్యసౌకర్యాలు కల్పించిన సింగిల్ రూమ్ ఐసొలేషన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరందరూ బ్రిటన్ నుంచి భారత్ కు ఇటీవల వచ్చినవారే. అంతేకాకుండా,వైరస్ సోకినవారితో గడిచిని కొద్దిరోజులుగా సన్నిహితంగా మెలిగినవారిని కూడా క్వారంటైన్ లో ఉంచడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా, వారితో కలిసి ప్రయాణించినవాళ్లను,కుటుంబసభ్యులను మరియు ఇతరుల కోసం కాంటాక్ట్ ట్రేసింగ్ మెదలుపెట్టినట్లు తెలిపారు.

మరోవైపు,బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్తరకం కరోనా ఇప్పటికే నెదరాండ్ల్స్,ఆస్ట్రియా,ఇటలీ,సింగపూర్,జపాన్,లెబనాన్,జర్మనీ,స్విట్జర్లాండ్,స్పెయిన్,ఫ్రాన్స్,కెనడా,స్వీడన్ దేశాల్లోకి ప్రవేశించింది.యూకేలో సహా యూరప్ లోని పలు దేశాల్లో కొత్త రకం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్త రకం కరోనా నేపథ్యంలో పలు యూరప్ దేశాలు మరోసారి లాక్ డౌన్ ను విధించాయి. కొత్త రకం కరోనా వైరస్..పాత దానికన్నా 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు సృష్టం చేసిన విషయం తెలిసిందే.