Antarctica India Scientist : అంటార్కిటికాలో కొత్త జాతి మొక్క

భారతీయ జీవ శాస్త్రవేత్తలు ఓ కొత్త జాతి మొక్కను కనుగొన్నారు. అంటార్కిటికాలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొని నామకరణం కూడా చేశారు. భారతదేశంలోని ‘భారత’ పేరు వచ్చే విధంగా ‘భారతి’ పేరు మీదుగా బ్రయమ్ భారతీయెన్సిస్ అని పేరు పెట్టారు.

India Discovers New Plant : మొక్కలు ఎన్నో రకాలు ఉంటాయి. తాజాగా..భారతీయ జీవ శాస్త్రవేత్తలు ఓ కొత్త జాతి మొక్కను కనుగొన్నారు. అంటార్కిటికాలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొని నామకరణం కూడా చేశారు. భారతదేశంలోని ‘భారత’ పేరు వచ్చే విధంగా ‘భారతి’ పేరు మీదుగా బ్రయమ్ భారతీయెన్సిస్ అని పేరు పెట్టారు. గడిచిన నాలుగు దశాబ్దాలకాలంలో ఆ ప్రాంతంలో కొత్త జాతి మొక్కను కనుగొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇండియన్ అంటార్కిటిక్ మిషన్ లో భాగంగా..భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

Read More : Zika Virus: తిరువనంతపురంలో మరో 14 జికా వైరస్ కేసులు.. లక్షణాలివే..

భారతీయెన్సిస్ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు ఆసియా – పసిఫిక్ బయోడైవర్సిటీ జర్నల్ లో మొక్కకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. పంజాబ్ లోని కేంద్రీయ విశ్వ విద్యాలయానికి చెందిన జీవిశాస్త్రవేత్తలు అక్కడ పరిశోధనలు చేస్తున్నారు. తూర్పు అంటార్కిటికాలోని లార్స్ మన్ హిల్స్ వద్ద ఉన్న భారతి పరిశోధన కేంద్రం సమీపంలో అరుదైన జాతులకు చెందని నాచు మొక్కలు పెరుగుతున్నాయని ఫెలిక్స్ బాస్ట్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. ఇతను పంజాబ్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలోని అసోసియేట్ ప్రొఫెసర్ గా బాస్ట్ పనిచేస్తున్నారు.

Read More : Bride Dancing Viral Video : తమిళ పాటకు డ్యాన్స్ చేసి జోష్ నింపిన కేరళ వధువు
ఈ మొక్కలకు సంబంధించి శాంపిళ్లను యూనివర్సిటీకి తీసుకొచ్చి…వాటిపై పరిశోధనలు చేయడం ప్రారంభించారు. పెంగ్విన్ల మలంపై ఈ మొక్కలు పెరుగుతున్నట్లు గుర్తించారు. కూల్ వాతావరణంలో మొక్కలు కూలిపోకుండా..ఉండేందుకు పెంగ్విన్ల మలంలో ఉండే నత్రజని దోహద పడుతుందని ఆయన వెల్లడించారు. మంచు ఖండంలో పెరుగుతున్న వేడి కారణంగా అక్కడ గతంలో ఎప్పుడూ లేని మొక్కల జాడ ప్రస్తుతం కనిపిస్తోందని బాస్ట్ తెలిపారు. ఏడాదిలో ఆరు నెలల పాటు..అంటార్కిటకాలో దట్టంగా మంచు కురుస్తోంది. ఈ సమయంలో సూర్యుని జాడ కనిపించదు. టెంపరేచర్స్ సైతం -76 డిగ్రీలకు పడిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మొక్క ఎలా జీవిస్తుందోనని శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొక్కలు పెరగడానికి సాధారణంగానే… నత్రజని, పోటాషియం, భాస్వరంతో సహా సూర్యరశ్మి..నీరు చాలా అవసరమనే సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు