భారతదేశ తొలి మహిళా మాజీ డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌదరి భట్టాచార్య.. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (ఆగస్టు 26)రాత్రి కన్నుమూశారు. భట్టాచార్య మృతిపట్ల దేశవ్యాప్తంగా ఐపీఎస్ అధికారులు నివాళులర్పించారు. భట్టాచార్య పోలీస్ శాఖలో ఎన్నో సేవలు చేశారనీ..ఉత్తరాఖండ్ పోలీసులు గుర్తు చేసుకున్నారు.
1973 బ్యాచ్‌కు చెందిన భట్టాచార్య.. ఉత్తరాఖండ్ తొలి మహిళా డీజీపీగా 2004లో నియమితులయ్యారు. 2007, అక్టోబర్ 31న పదవీ విరమణ పొందారు. అనంతరం 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు.
తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ కాగా..కంచన్ చౌదరి భట్టాచార్య ఐపీఎస్ సాధించిన రెండో మహిళగా ఘనత సాధించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో జన్మించిన భట్టాచార్య అమృత్‌సర్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలేజీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్..1993లో ఆస్ట్రేలియాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.
Kanchan Chaudhary Bhattacharya, the first woman DGP of Uttarakhand and the country, passed away in Mumbai last night, following a brief illness. pic.twitter.com/uN84uV8tTV
— ANI (@ANI) August 27, 2019
प्रदेश की पूर्व DGP श्रीमती कंचन चौधरी भट्टाचार्य, 1973 बैच की IPS अधिकारी, जो कुछ समय से बीमार चल रही थी, के निधन पर #UttarakhandPolice उनके परिजनों के प्रति शोक संवेदना व्यक्त करते हुए उत्तराखंड पुलिस में उनके द्वारा दिए गए अभूतपूर्व योगदान को याद करती है।@IPS_Association pic.twitter.com/dmk3IRthg6
— Uttarakhand Police (@uttarakhandcops) August 26, 2019