India Covid update
India Covid Update : దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 796 కోవిడ్ కేసులు నమోదయ్యాయయని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 946 మంది కోవిడ్ నుంచి కోలుకోగా..19 మంది మరణించినట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో 10,889 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.20 శాతంగా ఉండగా… రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 185.90 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
Also Read : King Koti Palace : కబ్జా కోరల్లో కింగ్‌కోఠి.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ
దేశంలో ఇప్పటి వరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 4,30,36,928కి చేరుకోగాకోలుకున్న వారి సంఖ్య 4,25,04,329కి చేరింది. ఇక కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 5,21,710కి చేరింది. మొత్తం యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉండగా జాతీయ కోవిడ్-19రికవరీ రేటు 98.78 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.