ముడి చమురు రేట్లు తగ్గుతున్నాయి… పెట్రోల్ నిల్వలు చేసుకోవడానికి భారత్‌కు ఇదే సరైన సమయం

కరోనా ప్రభావం Crude Oil ధరలపై కూడా పడింది. క్రూడ్ ఆయిల్ ధరలు 30డాలర్లు తగ్గడంతోసౌదీ అరేబియా, UAE నుంచి చమురును కొనుగోలు చేసి strategic petroleum reserves (SPR) ట్యాంక్‌లో నిల్వ చేసుకునేందుకు అవకాశంగా భావిస్తున్నారు. ఒపెక్ దేశాలు, రష్యా మధ్య ఇంధన ఉత్పత్తి తగ్గించాలన్న అంశంపై చర్చలు జరిగాయి. కానీ, విఫలం కావడంతో సౌదీఅరేబియా చమురు ధరలు భారీగా తగ్గించింది.
కరోనా వైరస్ ప్రభావంతో పాటు గతవారం సౌదీ అరేబియా రోజుకు 9.7 మిలియన్ బారెల్స్ (BPD) 13 మిలియన్ బిపిడీకి పడిపోయింది. రెండు రోజుల వ్యవధిలో ముడి చమురుకు డిమాండ్ తగ్గిపోవడంతో ధర 70డాలర్లు దిగజారింది.
భారతదేశంలో ప్రస్తుతం 5.33 మిలియన్ టన్నుల SPR ఉంది. విశాఖపట్నం, మంగళూరు, కర్ణాటక మూడు ప్రదేశాలలో గుహలలో ఉంచారు. ఇది 36.87 మిలియన్ బారెల్స్ చమురుతో సమానం. రాయిటర్స్ నివేదిక ప్రకారం… SPR ముడిచమురు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి 673.7 మిలియన్ డాలర్లు కావాలని అడిగింది.
ప్రస్తుతమున్న ధరల ప్రకారం.. సుమారు 22.5 మిలియన్ బారెల్స్ చమురుగా తెలింది. ఇది 3 మిలియన్ టన్నులకు సమానం. భారతదేశంలో రోజుకు 2.45 లక్షల బ్యారెల్స్(390లక్షల లీటర్లు) ఖర్చవుతుంది. ఈ ముడి నిల్వలు వాడుకోగలిగితే భారత్‌లో సుమారు 22 రోజుల పాటు సరఫరా చేసుకోవచ్చు.
అంతేకాదు COVID-19 ఎఫెక్ట్‌తో ముడిచమురుపై డిమాండ్ చాలా తగ్గుతోంది. వైరస్ ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో ఇరాక్ ముందుగా ఉంది. నెలకు 4 బిలియన్ డాలర్ల బడ్జెట్ లోటును ఎదుర్కొనే అవకాశం ఉంది. ముడి చమురు ధరల విషయంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA), ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC) అంచనా ప్రకారం.. చమురు ఉత్పత్తి చేసే దేశాలు ముడి చమురు క్షీణత నుండి వచ్చే ఆదాయాన్ని 2020లో 50శాతం నుంచి 85శాతం వరకు చూడవచ్చు.
Also Read | షేమ్..షేమ్ : రంజన్ గొగోయ్‌కి చేదు అనుభవం..ఆందోళనల మధ్య ప్రమాణ స్వీకారం