Prashant Kishor Audio Clip : బెంగాల్ లో టీఎంసీ ఓటమి ? ప్రశాంత్ కిశోర్ ఆడియో టేప్ కలకలం

సోషల్ మీడియాలో ప్రశాంత్ కిశోర్ కు సంబంధించిన ఆడియే టేప్ కలకలం రేపుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆయన ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

West Bengal Election : వెస్ట్ బెంగాల్ లో పాగా వేసేది ఎవరు ? మరోసారి టీఎంసీ అధికారం దక్కించుకుంటుందా ? సీఎం మమతకు బీజెపీ చెక్ పెట్టి..కాషాయ జెండా రెపరెపలాడిస్తుందా ? అంటే..ఇప్పుడే సమాధానం చెప్పలేం. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ లో 8 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ప్రస్తుతం 2021, ఏప్రిల్ 10వ తేదీ శనివారం నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో…సోషల్ మీడియాలో ప్రశాంత్ కిశోర్ కు సంబంధించిన ఆడియే టేప్ కలకలం రేపుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆయన ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వెస్ట్ బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేయడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రజలు భావిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఆడియో టేప్ పై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన ఆడియో కాదని ఖండిస్తున్నారు. ఆడియోలో కొంత భాగం కాదు..మొత్తం ఆడియో చాట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ లో బీజేపీ 100 స్థానాలకు మించి గెలవదని ప్రశాంత్ జోస్యం చెప్పారు.

ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా బాగా పేరు పొందారు. ఎలాగైనా సీఎం మమతా బెనర్జీని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని పీకే వ్యూహాలు రచించారు. బెంగాల్ ఎన్నికలు ప్రస్తుతం నాలుగో దశ కొనసాగుతున్నాయి. మొత్తం 8 దశల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ నెల 29వ తేదీతో ముగియడం, మే 02వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపైనే ఉంది. పీకే రచించిన వ్యూహాలు వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేదానిపై చర్చ జరుగుతోంది.
బీజేపీకి వందకు పైగా సీట్లు వస్తే..తాను తన పని వదిలేస్తానని, ఏ రాజకీయ పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వనని గతంలో కుండబద్ధలు కొట్టారాయన. తృణమూల్ కాంగ్రెస్ తనంతట తాను పతనమైతే తప్ప బెంగాల్ లో బీజేపీ గెలవలేదని స్పష్టం చేశారు.

బెంగాల్ బాధ్యతలు ముగిసిన అనంతరం పంజాబ్ రాష్ట్రానికి ప్రశాంత్ కిశోర్ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పీకే ప్రయత్నాలు చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం అమరీందర్ సింగ్ కు ప్రిన్స్ పల్ అడ్వైజరీ గా ఈయన నియమితులయ్యారు.


Read More : Coronavirus Live Updates : భయానకం… దేశంలో కరోనా రికార్డ్.. ఒక్కరోజే 1.45లక్షల కొత్త కేసులు

ట్రెండింగ్ వార్తలు