Coronavirus Live Updates : భయానకం… దేశంలో కరోనా రికార్డ్.. ఒక్కరోజే 1.45లక్షల కొత్త కేసులు

దేశంలో కరోనావైరస్ మమమ్మారి రెచ్చిపోతోంది. ఎన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా 11లక్షల 73వేల 219 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..లక్షా 45వేల 384 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా 794 మరణాలు సంభవించాయి.

Coronavirus Live Updates : భయానకం… దేశంలో కరోనా రికార్డ్.. ఒక్కరోజే 1.45లక్షల కొత్త కేసులు

Corona Cases Have Increased Massively In India1

Coronavirus Live Updates : దేశంలో కరోనావైరస్ మమమ్మారి రెచ్చిపోతోంది. ఎన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా 11లక్షల 73వేల 219 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..లక్షా 45వేల 384 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా 794 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,32,05,926 చేరగా.. 1,68,436 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం(ఏప్రిల్ 10,2021) వివరాలు తెలిపింది.

10లక్షలు దాటిన యాక్టివ్ కేసులు:
ఇక యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 10లక్షల మార్క్ దాటింది. 10లక్షల 46వేల 631మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 8 శాతానికి చేరువైంది. మరోవైపు రికవరీ రేటు 90.8శాతానికి పడిపోయింది. అయితే, నిన్న(ఏప్రిల్ 9,2021) ఒక్కరోజే 77వేల 567 మంది కోలుకోవడం సానుకూల పరిణామం. ప్రస్తుతం వైరస్‌ను జయించిన వారి సంఖ్య కోటీ 20లక్షలకు చేరువైంది.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం:
మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 58వేల 993 మందికి వైరస్ సోకగా..301 మంది చనిపోయారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 32లక్షలకు పైబడగా..57వేల మందికిపైగా ప్రాణాలు వదిలారు. సుమారు 27లక్షల మంది కోలుకున్నారు. వైరస్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 5,36,063 మందికి చేరింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో.. సగానికిపైగా యాక్టివ్ కేసులు మహారాష్ట్రలోనే కావడం విశేషం.

తెలంగాణలో 3వేలకు చేరువలో కరోనా కేసులు:
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 3వేలకు చేరువలో కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న(ఏప్రిల్ 9,2021) రాత్రి 8గంటల వరకు 1,11,726 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 2వేల 909 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరో ఆరుగురు మృతి:
రాష్ట్రంలో నిన్న కరోనాతో మరో ఆరుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,752కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 584 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,04,548కి చేరింది. ప్రస్తుతం 17,791 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 11,495 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 487 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం(ఏప్రిల్ 10,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీలో కరోనా కల్లోలం:
ఏపీలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 31వేల 892 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 2వేల 765 మందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా కరోనాతో 11 మంది ప్రాణాలు విడిచారు. కోవిడ్ కారణంగా అనంతపురం లో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కొత్తగా 1,245 మంది కరోనా జయించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,53,65,743 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16వేల 422 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 9,2021) సాయంత్రం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఏకంగా 496 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 490 కేసులు బయటపడ్డాయి.

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య: 9,18,597
రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య : 8,94,896
రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య: 7,279