భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు భారత వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానాలను వాడింది. అవి టార్గెట్లను కచ్చితమైన రీతిలో ఛేదించాయి. దీంతో, భారత్‌తో పోల్చితే పాకిస్థాన్ వైమానిక దళ శక్తి ఏ మేరకు ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్ వద్ద ఉన్న అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానాలు రాఫెల్ జెట్లు. పాకిస్థాన్ వద్ద ఉన్న అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానాలు ఎఫ్ 16 జెట్లు. వీటిలో ఏవి అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. వాటి ప్రత్యేకతలు ఏంటి? పాక్ వద్ద ఉన్న యుద్ధ విమానాలు రాఫెల్‌తో పోల్చితే ఎందుకంత బలహీనమైనవి?
రాఫెల్ యుద్ధ విమానాలు
- రాఫెల్ అనేది 4.5 జనరేషన్ యుద్ధ విమానం. భారత వైమానిక దళం వద్ద ఉన్న అత్యంత ఆధునికమైన యుద్ధ విమానం ఇది.
- రాఫెల్ జెట్లను మన దేశం కోసం ప్రత్యేకంగా 13 ప్రత్యేక ఫీచర్లతో తయారు చేశారు.
- ఇవి మెటియోర్ క్షిపణులతో ఉంటాయి. చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం చేధిస్తాయి.
- శత్రువుల దాడుల నుంచి జెట్‌ను రక్షించడానికి రాఫెల్‌కు బలమైన ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు ఉన్నాయి. అధునాతన రాడార్ (థేల్స్ RBE2 AESA)కూడా ఉంది. ఇది శత్రువులను ముందుగానే గుర్తించి మన యుద్ధ విమానాలను సురక్షితంగా ఉంచడానికి, అలర్ట్ చేయడానికి సాయపడుతుంది.
- ఈ జెట్ ముందు భాగంలో స్టెల్త్ ఫీచర్లు ఉంటాయి. దీనివల్ల శత్రు దేశాలు మన యుద్ధ విమానాలను గుర్తించడం కష్టతరం అవుతుంది.
- ఇది SCALP, HAMMER వంటి స్మార్ట్ ఆయుధాలను మోసుకెళ్తుంది. చాలా దూరం నుంచి కూడా లక్ష్యాలను చాలా కచ్చితత్వంతో ఛేదిస్తాయి. ఈ ఆయుధాలనే ఆపరేషన్ సిందూర్‌లో వాడారు. దూరంగా ఉండే శత్రు ప్రాంతాలను చాలా డెప్త్‌గా ఢీకొట్టే రాఫెల్ సామర్థ్యాన్ని ఇది రుజువు చేసింది.
Also Read: ‘ఆపరేషన్ సిందూర్’పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్..
పాక్ F-16 యుద్ధ విమానాలు
- అమెరికా నుంచి పాకిస్థాన్ కొనుక్కున్న F-16 యుద్ధ విమానాలు చాలా బలమైన యుద్ధ విమానాలు.
అయితే, వీటిని పాక్‌కు ఇచ్చే సమయంలో అమెరికా కఠినమైన నియమాలను విధించింది. వీటిని భారత్‌పై దాడి చేయడానికి పాకిస్థాన్ ఉపయోగించకూడదు.
- ఈ యుద్ధ విమానాలను పాకిస్థాన్ రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాలి. యుద్ధాలకు వాడకూడదు.
- పాకిస్థాన్ వద్ద దాదాపు 75 F-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ, వీటన్నింటి నిర్వహణ ఖర్చులు భరించేంత నిధులు పాక్ వద్ద లేవు.
- F-16 యుద్ధ విమానాలు తక్కువ దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తాయి. వీటిలో AIM-120C5 AMRAAM క్షిపణులను వాడతాయి. దీర్ఘ శ్రేణి లక్ష్యాలపై దాడులు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వంటి వాటిల్లో రాఫెల్స్ ముందు F-16 యుద్ధ విమానాలు సరితూలవు.
పాక్ JF-17 యుద్ధ విమానాలు
- JF-17 యుద్ధ విమానాలను పాకిస్థాన్, చైనా తయారు చేశాయి. ఇది పాకిస్థాన్ వైమానిక దళ ప్రధాన యుద్ధ విమానాలు ఇవి.
- JF-17 యుద్ధ విమానాల ధరలు తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ చాలా శక్తిమంతమైనవి. రాఫెల్‌తో పోల్చితే మాత్రం బలహీన ఇంజిన్, సిస్టమ్స్ JF-17 యుద్ధ విమానాల్లో ఉంటాయి.
- కొత్త JF-17 బ్లాక్ 3 వెర్షన్‌లో మెరుగైన రాడార్, కంట్రోల్స్ ఉన్నాయి. అయినప్పటికీ రాఫెల్ అంతటి సమర్థమైనవి కాదు.
- JF-17 యుద్ధ విమానాలు తక్కువ రేంజ్‌లో టార్గెట్‌లను ఛేదిస్తాయి. కఠిన వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పనిచేసే శక్తి లేదు.