National Covid Cases
India Covid-19 Update : దేశంలో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 3,39,85,920 కి చేరింది. దేశవ్యాప్తంగా 26,579 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ సోకి కోలుకున్న వారి సంఖ్య 3,33,20,057కి చేరింది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98 శాతానికి పెరిగింది.
Also Read : Power Crisis In India : పండగ పూట కరెంటు తిప్పలు…. తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షోభం
గడిచిన 24 గంటల్లో 181 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో కోవిడ్ సోకి మరణించిన వారి సంఖ్య 4,50,963కి చేరగా ప్రస్తుతం దేశంలో 2,14,900 యాక్టివ్ కేసులున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియచేసింది.ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశంలో వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 95.89 కోట్ల మంది కరోనా టీకా తీసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 65.86 లక్షల మంది కొత్తగా టీకా తీసుకున్నారు.