COVID-19 UPDATE: దేశంలో ప్రస్తుతం 2,423 కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో కొత్తగా 163 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,423 ( 0.01 శాతం)గా ఉందని పేర్కొంది. రికవరీ రేటు ప్రస్తుతం 98.8 శాతం ఉన్నట్లు చెప్పింది. కొత్తగా కరోనా నుంచి 247 మంది కోలుకున్నారని, దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,41,46,781కి పెరిగిందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.10 శాతం, వారాంతపు పాజిటివిటీ రేటు 0.11 శాతం ఉన్నట్లు పేర్కొంది.

CORONA

COVID-19 UPDATE: చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ భారత్ లో మాత్రం కొవిడ్ కేసులు ప్రస్తుతం తక్కువగానే నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 163 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,423 ( 0.01 శాతం)గా ఉందని పేర్కొంది.

రికవరీ రేటు ప్రస్తుతం 98.8 శాతం ఉన్నట్లు చెప్పింది. కొత్తగా కరోనా నుంచి 247 మంది కోలుకున్నారని, దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,41,46,781కి పెరిగిందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.10 శాతం, వారాంతపు పాజిటివిటీ రేటు 0.11 శాతం ఉన్నట్లు పేర్కొంది.

దేశంలో ఇప్పటివరకు వినియోగించిన కరోనా డోసుల సంఖ్య 220.13 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది. వాటిలో రెండో డోసులు 95.14 కోట్లు, ప్రికాషన్ డోసులు 22.43 కోట్లు ఉన్నాయని పేర్కొంది. నిన్న 58,938 డోసులను వినియోగించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 91.21 కోట్ల కరోనా పరీక్షలు చేశామని, నిన్న 1,56,040 కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. కాగా, పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. గత గణాంకాలను బట్టి చూస్తూ ఈ నెలలో దేశంలోనూ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

AndhraPradesh Ministers: ‘మేము ముందే చెప్పాం’.. అంటూ చంద్రబాబు, పవన్ భేటీపై ఏపీ మంత్రుల మండిపాటు