AndhraPradesh Ministers: ‘మేము ముందే చెప్పాం’.. అంటూ చంద్రబాబు, పవన్ భేటీపై ఏపీ మంత్రుల మండిపాటు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భేటీపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. వారిద్దరూ కలుస్తారని తాము ముందే చెప్పామని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. వారిద్దరు కలిసినా తమకు ఏమీ నష్టం లేదని అన్నారు. పవన్ కు నైతిక విలువలు ఏమీ లేవని విమర్శించారు. ఏపీలో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలూ గెలుచుకుంటుందని చెప్పారు.

AndhraPradesh Ministers: ‘మేము ముందే చెప్పాం’.. అంటూ చంద్రబాబు, పవన్ భేటీపై ఏపీ మంత్రుల మండిపాటు

Bitter Experience To Ysrcp Leader Ambati Rambabu From Gadapa Gadapaku Program

AndhraPradesh Ministers: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భేటీపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. వారిద్దరూ కలుస్తారని తాము ముందే చెప్పామని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. వారిద్దరు కలిసినా తమకు ఏమీ నష్టం లేదని అన్నారు. పవన్ కు నైతిక విలువలు ఏమీ లేవని విమర్శించారు. ఏపీలో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలూ గెలుచుకుంటుందని చెప్పారు.

ఇటీవల టీడీపీ నిర్వహించిన సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడకపోవడం ఏంటని ఆయన నిలదీశారు. పవన్ కల్యాణ్ బీజేపీతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తూనే చంద్రబాబు నాయుడిని కలవడానికి సిగ్గులేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను కాపాడుకోవడానికే తాము జీవో నంబరు 1 తీసుకు వచ్చామని చెప్పారు.

టీడీపీ, జనసేన కలవడంతో ఆశ్చర్యం ఏమీ లేదని అన్నారు. చంద్రబాబు నాయుడి ఇంటికి పవన్ కల్యాణ్ సంక్రాంతి ప్యాకేజీ కోసమే వెళ్లారని ఏపీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోయినా దానిపై పవన్ కల్యాణ్ స్పందించడం లేదని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసినప్పటికీ తమకు వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు.

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలయిక కొత్తేమీ కాదని చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తారని అన్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ టీడీపీ కండువా కప్పుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని టీడీపీ, జనసేన చూస్తున్నాయని అన్నారు.

Airtel 5G Services : దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మరో రెండు నగరాల్లోకి.. ఇదిగో ఫుల్ లిస్ట్ మీకోసం..!