Corona Cases : దేశంలో కొత్తగా 12,591 కరోనా కేసులు, 40 మంది మృతి

ఇప్పటివరకు 4.47 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 5.31లక్షల మంది మృతి చెందారు.

Corona Cases

Corona Cases : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కోవిడ్ కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,591 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 40 మంది మృతి చెందారు. బుధవారం నమోదైన కేసులతో పోల్చితే 20 శాతం పాజిటివ్ కేసులు పెరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 65,283 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు 4.47 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 5.31లక్షల మంది మృతి చెందారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

Covid-19 Cases: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతంగా ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.