Covid-19 Cases: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు

ఏప్రిల్ 10, 11వ తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర సర్కారు కోరింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రులు ఆసుపత్రులను సందర్శించి కొవిడ్ మాక్ డ్రిల్ కసరత్తులను సమీక్షించాలని కేంద్ర ఆరోగ్యమంత్రి సూచించారు.

Covid-19 Cases: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు

Corona Cases Rise In India

Covid -19 Cases: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కొవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కొవిడ్-19 నిర్వహణ, ప్రజారోగ్య భద్రతకు సంసిద్ధతపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్షించారు.

గతంలో కొవిడ్ పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా కేంద్ర, రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో పనిచేయాలని చెప్పారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కొవిడ్ ప్రొటోకాల్ అమలును కొనసాగించాలని రాష్ట్రాలకు కేంద్ర సర్కారు సూచించింది. రేపు,ఎల్లుండి జిల్లా స్థాయిలో ప్రజారోగ్య అధికారులతో కొవిడ్ నివారణ సంసిద్ధతపై సమీక్షించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ కోరారు.

ఏప్రిల్ 10, 11వ తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర సర్కారు కోరింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రులు ఆసుపత్రులను సందర్శించి కొవిడ్ మాక్ డ్రిల్ కసరత్తులను సమీక్షించాలని కేంద్ర ఆరోగ్యమంత్రి సూచించారు. కొవిడ్ కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

అత్యవసర హాట్‌స్పాట్‌లను గుర్తించాలని, కొవిడ్ పరీక్షలు, టీకాలు వేయడం, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. కాగా, దేశంలో మళ్లీ కరోనా కేసులో వేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఢిల్లీ, మహారాష్ట్రల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి.

Covid -19 Cases: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. 24గంటల్లో 6వేలకుపైగా కొత్త కేసులు