Covid -19 Cases: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. 24గంటల్లో 6వేలకుపైగా కొత్త కేసులు

గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో 24గంటల్లో కరోనా కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

Covid -19 Cases: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. 24గంటల్లో 6వేలకుపైగా కొత్త కేసులు

covid test

Covid -19 Cases: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 6,050 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కు చేరింది. గురువారం కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 5, 300 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లోనే అదనంగా 13శాతం కేసుల పెరుగుదల నమోదైంది.

India Covid : మళ్లీ హడలెత్తిస్తున్న కోవిడ్ .. 24 గంటల్లో 20 శాతం పెరిగిన కొత్త కేసులు,13 మంది మృతి

గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో 24గంటల్లో కరోనా కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గురువారం ఒక్కరోజులో కోవిడ్ కారణంగా 14 మంది మరణించారు. దీంతో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 5,30,943కు చేరింది. మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4.47 కోట్లుకు చేరింది.

China Covid Deaths : చైనాలో కరోనా టెర్రర్.. భారీగా పెరగనున్న కోవిడ్ మృతుల సంఖ్య, రోజుకు 36వేల మరణాలు..!

ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. రోజువారి పాజిటివిటీ రేటు 3.39శాతంకు పెరిగింది. వారపు పాజిటివిటీ రేటు 3.02శాతంగా నమోదైంది. కోవిడ్ కేసుల రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం మధ్యాహ్నం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహచరులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.