China Covid Deaths : చైనాలో కరోనా టెర్రర్.. భారీగా పెరగనున్న కోవిడ్ మృతుల సంఖ్య, రోజుకు 36వేల మరణాలు..!

చైనా న్యూ ఇయర్ వేడుకల తర్వాత రోజువారీ మరణాల సంఖ్య 36 వేలకు చేరుకునే అవకాశం ఉందన్న అంతర్జాతీయ సంస్థల అంచనాలు చైనీయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

China Covid Deaths : చైనాలో కరోనా టెర్రర్.. భారీగా పెరగనున్న కోవిడ్ మృతుల సంఖ్య, రోజుకు 36వేల మరణాలు..!

Updated On : January 22, 2023 / 11:55 PM IST

China Covid Deaths : కరోనా వైరస్ మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో.. కలకలం కొనసాగుతోంది. కోవిడ్ మహమ్మారి చైనాకు చుక్కలు చూపిస్తోంది. అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మళ్లీ మహమ్మారి విజృంభించింది. పాజిటివ్ కేసులు, కరోనా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రానున్న రోజుల్లో కోవిడ్ మరణాల సంఖ్య మరీ దారుణంగా పెరిగిపోనుందనే నివేదికలు చైనీయులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

చైనాలో కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల లాక్ డౌన్ లు ఎత్తేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు. దానికితోడు, చైనా వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలు ఉన్నాయి. చైనాలో కరోనా మరణాలు తీవ్ర ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో చైనాలో 13వేల మంది కొవిడ్ తో చనిపోయినట్లు వెల్లడైంది. జీరో కోవిడ్ పాలసీ ఎత్తేశాక జనవరి 12 వరకు 60 వేల మంది చనిపోగా, ఈ వారం రోజుల్లో భారీ స్థాయిలో కరోనా బాధితులు మరణించడం చైనా అధికారులను టెన్షన్ పెడుతోంది.

Also Read..China Covid : చైనాలో కోవిడ్ కల్లోలం.. 80శాతం మందికి వైరస్ ఇన్ఫెక్షన్, నెల రోజుల్లో 60వేల మరణాలు

కాగా.. చైనా అధికారులు చెబుతున్న కరోనా మరణాలు ఆసుపత్రుల్లో నమోదైనవే. ఇళ్లలో చనిపోయిన వారిని కూడా లెక్కిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. చైనా నూతన సంవత్సర వేడుకల కోసం చాలామంది సొంత ఊర్లకు వెళ్లారని, దాంతో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. చైనా న్యూ ఇయర్ వేడుకల తర్వాత రోజువారీ మరణాల సంఖ్య 36 వేలకు చేరుకునే అవకాశం ఉందన్న అంతర్జాతీయ సంస్థల అంచనాలు చైనీయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇదిలా ఉంటే.. చైనాలో ఇప్పటికే 80శాతం మందికి కోవిడ్ సోకిందని, ఈ క్రమంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదని ఆ దేశ సీడీసీ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జిన్ యూ అభిప్రాయపడ్డాడు. అయితే కొత్త సంవత్సరం సెలవుల వేళ వైరస్ విస్తరించే ప్రమాదం ఉందన్నారు. చైనాలో లునార్ న్యూ ఇయర్ వేడుకలకు సెలవులిచ్చారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది చైనీయులు సొంత గ్రామాలకు వెళ్లారు. ప్రయాణాలపై అధ్యక్షుడు జిన్ పింగ్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశారు.