China Covid : చైనాలో కోవిడ్ కల్లోలం.. 80శాతం మందికి వైరస్ ఇన్ఫెక్షన్, నెల రోజుల్లో 60వేల మరణాలు

చైనాలో ఇప్పటికే 80శాతం మందికి కోవిడ్ సోకిందని, ఈ క్రమంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదని ఆ దేశ సీడీసీ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జిన్ యూ అభిప్రాయపడ్డాడు. అయితే కొత్త సంవత్సరం సెలవుల వేళ వైరస్ విస్తరించే ప్రమాదం ఉందన్నారు.

China Covid : చైనాలో కోవిడ్ కల్లోలం.. 80శాతం మందికి వైరస్ ఇన్ఫెక్షన్, నెల రోజుల్లో 60వేల మరణాలు

China Covid : చైనాలో ఇప్పటికే 80శాతం మందికి కోవిడ్ సోకిందని, ఈ క్రమంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదని ఆ దేశ సీడీసీ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జిన్ యూ అభిప్రాయపడ్డాడు. అయితే కొత్త సంవత్సరం సెలవుల వేళ వైరస్ విస్తరించే ప్రమాదం ఉందన్నారు. చైనాలో లునార్ న్యూ ఇయర్ వేడుకలకు సెలవులిచ్చారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది చైనీయులు సొంత గ్రామాలకు వెళ్లారు. ప్రయాణాలపై అధ్యక్షుడు జిన్ పింగ్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశారు.

సెకండ్ వేవ్ ప్రమాదం లేదంటూనే వచ్చే రెండు మూడు నెలల్లో కేసులు పెరిగే ముప్పు ఉందన్నారు చైనా ప్రభుత్వం ప్రధాన అంటువ్యాధుల నిపుణుడు. ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లుగా ఉంది. ఇందులో 80శాతం మందికి కోవిడ్ వచ్చిందని అంచనా. జీరో కోవిడ్ పాలసీ ఎత్తేసిన నెల రోజుల్లోనే 60వేల కోవిడ్ మరణాలు నమోదైనట్లు చైనా అధికారికంగా వెల్లడించింది. న్యూఇయర్ సెలవులతో రోజుకు 30వేల కరోనా మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి.

Also Read..China Covid Deaths : చైనాలో కరోనా టెర్రర్.. భారీగా పెరగనున్న కోవిడ్ మృతుల సంఖ్య, రోజుకు 36వేల మరణాలు..!

కరోనా కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల లాక్ డౌన్ లు ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదవుతోంది. దానికితోడు, చైనా వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలున్నాయి. చైనాలో కరోనా మరణాలు తీవ్ర ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన వారం రోజుల్లో చైనాలో 13వేల మంది కరోనాతో చనిపోయారు. లాక్ డౌన్ ఎత్తివేశాక జనవరి 12 వరకు 60 వేల మంది చనిపోగా, ఈ వారం రోజుల్లో భారీ స్థాయిలో కరోనా బాధితులు మరణించడం చైనా అధికార వర్గాలను టెన్షన్ పెడుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చైనా అధికారులు చెబుతున్న కరోనా మరణాలు ఆసుపత్రుల్లో నమోదైనవే. ఇళ్లలో చనిపోయిన వారిని కూడా లెక్కిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. చైనా న్యూ ఇయర్ వేడుకల కోసం చాలామంది సొంత ఊర్లకు వెళ్లారని, దాంతో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.