Corona Cases : 231 రోజుల తర్వాత అత్యల్ప కేసులు నమోదు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 25 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Corona Cases : దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 25 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 231 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య.. ఇక తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,40,94,373 చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 19,470 మంది కరోనా నుంచి కొనుకొని ఇళ్లకు వెళ్లారు.

చదవండి : Coronavirus Update: కరోనా నుంచి తప్పించుకున్నట్లేనా? భారీగా తగ్గిన కేసులు.. ఎప్పుడు మాస్క్‌లు లేకుండా తిరగొచ్చు?

గడిచిన 24 గంటల్లో 164 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 1,83,118 ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఇప్పటి వరకు దేశంలో వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,52,454గా ఉన్నది. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 98.67 కోట్ల కోవిడ్ టీకా డోసులను ఇచ్చారు.

చదవండి : Corona Vaccine : చెత్తకుప్పలో 1.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు.. భారీగా టీకాల వృథా

కేరళలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 6676 కేసులు రికార్డు అయినట్లు ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రంలో కరోనాతో 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రికవరీ రేటు 98.14 శాతం ఉందని, మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికమని ప్రభుత్వం చెప్పింది.

ట్రెండింగ్ వార్తలు