India Covid Update : దేశంలో తగ్గిన కోవిడ్ కేసులు- కొత్తగా 1,761 నమోదు

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న కొత్తగా 1,761 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

India Covid Up Date

India Covid Update : దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న కొత్తగా 1,761 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో 127 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు.

ప్రస్తుతం దేశంలో 26,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. దేశంలో ఇంతవరకు 4,30,07,841 కేసులు నమోదు కాగా.. 5,16,479 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు.  నిన్న కోవిడ్ నుంచి 3,196 మంది కోలు కున్నారు. దీంతో ఇంతవరకు  4,24,65,122 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read : Russian President Putin : ప్రాణభయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌
దేశంలో ఇంతవరకు 78.26 కోట్ల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారని ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో గత 429 రోజుల నుంచి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇంతవరకు 181.21 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు.