CORONA
India Corona Cases : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వివిధ దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3397 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంట్లలో 184 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.8 శాతం ఉన్నట్లు పేర్కొంది.
రోజువారీ పాజిటివ్ రేటు 0.15 శాతంగా ఉందని వెల్లడించింది. గత 24 గంటల్లో లక్ష కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్లు వివరించింది. మరోవైపు బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చైనాలో మళ్లీ కరోనా విషయం తాండవం చేస్తోంది.
China Corona : బాబోయ్.. ఒక్కరోజే 3కోట్ల 70లక్షల కరోనా కేసులు, చైనాలో కోవిడ్ ఉగ్రరూపం
చైనాలో భారీగా కేసులు పెరగడానికి బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కారణం. భారత్ లోకి కొత్త వేరియంట్ ప్రవేశించింది. దేశంలో మూడు బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక కేసు చొప్పున నమోదు అయ్యాయి. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కు పంపారు. కొత్త వేరియంట్ సోకిన ముగ్గురు ఐసోలేషన్ లో ఉన్నారు.