China Corona : బాబోయ్.. ఒక్కరోజే 3కోట్ల 70లక్షల కరోనా కేసులు, చైనాలో కోవిడ్ ఉగ్రరూపం

కరోనా పుట్టినిల్లైన చైనాలో కొవిడ్ కేసుల పుట్ట పగులుతోంది. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్ల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అది కూడా ఒక్కరోజులోనే. డ్రాగన్ కంట్రీలో 24గంటల వ్యవధిలోనే 3కోట్ల 70 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బయటపడినప్పటి నుంచి ఒక్కరోజుల్లో 3 కోట్ల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

China Corona : బాబోయ్.. ఒక్కరోజే 3కోట్ల 70లక్షల కరోనా కేసులు, చైనాలో కోవిడ్ ఉగ్రరూపం

China Corona : కరోనా పుట్టినిల్లైన చైనాలో కొవిడ్ కేసుల పుట్ట పగులుతోంది. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్ల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అది కూడా ఒక్కరోజులోనే. డ్రాగన్ కంట్రీలో 24గంటల వ్యవధిలోనే 3కోట్ల 70 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బయటపడినప్పటి నుంచి ఒక్కరోజుల్లో 3 కోట్ల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

చైనాలో మూడు రోజుల క్రితం అంటే డిసెంబర్ 20న 3 కోట్ల 70లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాకు సంబంధించిన విషయాలన్నీ గుట్టుగా దాచిపెడుతున్న చైనా ప్రభుత్వం.. ఇది కూడా బయటపడకుండా చూసింది. డిసెంబర్ 20న కేవలం 3వేల 49మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారిక లెక్కల్లో నమోదు చేసింది.

Also Read..BF7 Omicron Variant : బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ తో ముప్పు ఎక్కువే.. ఒకరి నుంచి 18 మందికి వేగంగా వ్యాప్తి, వైరస్ లక్షణాలేంటి?

అయితే, మొన్న నేషనల్ హెల్త్ కమిషన్ అంతర్గత సమావేశంలో ఈ కేసుల గురించి మాట్లాడుకున్నారు. ఆ మీటింగ్ కు సంబంధించిన వివరాలు బయటపడటంతో ఒక్కరోజులోనే 3కోట్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం ఇప్పుడు బయటపడింది. ఈ నెల మొదటి నుంచి డ్రాగన్ కంట్రీని..కరోనా.. కకావికలం చేస్తోంది.

ఈ నెల 20వ తేదీ వరకు తొలి 20 రోజుల్లో 24 కోట్ల 80 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. అంటే, 20 రోజుల్లోనే చైనా జనాభాలో 18శాతం మందికి పాజిటివ్ వచ్చినట్లు. ఆ తర్వాత మూడు రోజులకే ఒక్కరోజులోనే 3 కోట్ల మందికిపైగా జనం కరోనా బారిన పడ్డారు. ఇక రాబోయే నెలల్లో లక్షల మందికి వైరస్ సోకుతుందని నిపుణులు అంచనా వేశారు. అంతేకాదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read..Covid-19: కోవిడ్ తీవ్రతపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 చైనాలో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. వైరస్ బాధితులతో ఆసుపత్రుల్లోని ఐసీయూ బెడ్లన్నీ నిండిపోయాయి. దీంతో బెడ్లు సరిపోక నేలపైనే చికిత్స అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది చివరి నాటికి చైనాలో 20లక్షల మంది కోవిడ్ తో మరణించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.