BF7 Omicron Variant : బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ తో ముప్పు ఎక్కువే.. ఒకరి నుంచి 18 మందికి వేగంగా వ్యాప్తి, వైరస్ లక్షణాలేంటి?

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. ప్రధానంగా చైనాలో మరోసారి కరోనా విలయం తాండవం చేస్తోంది. తాజాగా బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ గడగడలాడిస్తోంది. రోజు రోజుకు పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది.

BF7 Omicron Variant : బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ తో ముప్పు ఎక్కువే.. ఒకరి నుంచి 18 మందికి వేగంగా వ్యాప్తి, వైరస్ లక్షణాలేంటి?

omicron

BF7 Omicron Variant : ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. ప్రధానంగా చైనాలో మరోసారి కరోనా విలయం తాండవం చేస్తోంది. తాజాగా బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ గడగడలాడిస్తోంది. రోజు రోజుకు పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అయితే దీనికి గతేడాది వచ్చిన ఒమిక్రాన్ లోని బీఎఫ్ 7 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు ప్రస్తుతం చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా కేసుల తీవ్రత మాత్రంకొనసాగుతోంది. ఇది కార్చిచ్చులా వేగంగా వ్యాపిస్తోందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. చైనాతోపాటు అమెరికా, బ్రిటన్ సహా యూరోపియన్ దేశాలైన బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ సహా ఇతర దేశాల్లోనూ ఈ వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.

భారత్ లోకి వేరియంట్ ప్రవేశం..
భారత్ లోకి కూడా బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ ప్రేవేశించింది. దేశంలో మూడు కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. గుజరాత్ లోని వడోదరలో ఓ ఎన్ ఆర్ ఐ మహిళతో పాటు మరొకరికి, ఒడిశాలో ఒకరిలో ఈ వేరియంట్ ను గుర్తించినట్లు వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో అన్ని ఎయిర్ పోర్టులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా టెస్టులు చేయడంతోపాటు జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ సూచించారు.

China Corona Cases : చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. రోజుకు 10 లక్షల కేసులు, 5 వేల మరణాలు..!

బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు..
ఒమిక్రాన్ ఇతర వేరియంట్ల లక్షణాల తరహాలోనే బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఉంటాయి. ఈ వేరియంట్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, డయేరియా, ఛాతిలో నొప్పి, వణుకు, వాహన గుర్తించలేకపోవడం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ వైరస్ సోకిన ప్రతి ఒక్కరికీ ఈ లక్షణాలన్నీ ఉంటాయని చెప్పలేమని, కొందరిలో కొన్ని లక్షణాలు ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

ఈ వేరియంట్ సోకిన వ్యక్తి నుంచి 18 మందికి వ్యాప్తి..
ఈ వేరియంట్ R ఫ్యాక్టర్ 10-18.6గా ఉంది. అంటే ఈ వేరియంట్ సోకిన వ్యక్తి నుంచి 18 మందికి వ్యాప్తి చెందుతుంది. గతేడాది వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపకపోయినా ..ఆ వేరియంట్ లోని మిగతా సబ్ వేరియంట్స్ తో పోలిస్తే ఇది కొంత ప్రమాకరమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కు మానవ రోగ నిరోధక వ్యవస్థను ప్రతిఘటించగల సామర్థ్యం ఉందని చెబుతున్నారు. అంతేకాక, ఇది శరీరంలో వ్యాప్తి చెందేందుకు మిగతా వేరియంట్లతో పోలిస్తే తక్కువ సమయం తీసుకుంటుంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. చైనాలో అధికారికంగా రోజుకు మూడు వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.

BF.7 Variant: దూసుకొస్తున్న కరోనా కొత్త వేరియంట్.. బీఎఫ్.7తో ముప్పే అంటున్న నిపుణులు

ఈ వేరియంట్ తో మరణాలు సంభవిస్తాయా?
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల మరణాలు ఎక్కువగా సంభవించలేదు. కానీ ఈ వేరియంట్ తో మరణాలు సంభవించవని కొట్టి పారేయలేమని వైద్య నిపుణులు అంటున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు, బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వారిపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. చైనాలో రోజుకు మూడు వేల నుంచి నాలుగు వేల బీఎఫ్ 7 కేసులు అధికారికంగా నమమోదుకాగా మరణాలు 3-5 సంభవిస్తున్నాయని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. కానీ అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోందని, గతంలోలాగే చైనా ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను బయటికి ప్రపంచానికి తెలియకుండా దాచిపోడుతోందని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయ. ఈ వేరియంట్ తో ఫోర్త్ వేవ్ వస్తే ప్రపంచంలో సుమారు 10 లక్షల మరణాలు సంభవించే ప్రమాదముందని ఓ సర్వే అంచనా.

వ్యాక్సిన్ వేసుకున్నా వేరియంట్ వస్తుందా?
ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ వైరస్ మానవ రోగ నిరోధక శక్తిని ప్రతిఘటించి ఎదుగుతుందని తెలుస్తోంది. వ్యాక్సిన్లతో వచ్చే రోగ నిరోధక శక్తిని కూడా అధిగమించి ఈ వేరియంట్ సోకుతుంది. గతంలో కరోనా వచ్చిన వారికి కూడా ఈ వేరియంట్ సోకే అవకాశం ఉంది. అయితే శ్వాసకోశ సంబంధ సమస్యలు, డయెబెటీస్, గుండె సంబంధ సమస్యలున్న వారితోపాటు వృద్ధులు, గర్బిణులు, రోగ నిరోధక శక్తి తక్కువగ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

BF-7 Omicron Variant : భారత్ లోకి ప్రవేశించిన బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్.. గుజరాత్, ఒడిశాలో కేసులు గుర్తింపు

జాగ్రత్తలు తప్పనిసరి..
కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు తిరిగి పాటించడం ద్వారా కొత్త వేరియంట్ ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. వ్యాక్సిన్ తీసుకోవాని వారు వీలైనంత త్వరగా ప్రభుత్వ, ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకోవడం మంచింది. అర్హులైన వారు బూస్టర్ డోస్ తీసుకోవాలి. రం, దగ్గు, శ్వాస సమస్యలు, రుచి లేకపోవడం వంటి లక్షణాలుంటే కరోనా టెస్టు చేయించుకోవాలి. వ్యక్తులు, వస్తువులను తాకితే తరుచూ శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలి. మానసింగా ధైర్యంగా ఉండటం ముఖ్యం.