BF.7 Variant: దూసుకొస్తున్న కరోనా కొత్త వేరియంట్.. బీఎఫ్.7తో ముప్పే అంటున్న నిపుణులు

దేశంలోకి మరో కరోనా కొత్త వేరియంట్ ప్రవేశించింది. ఒమిక్రాన్ బీఎఫ్7 పేరుతో వచ్చిన కొత్త వేరియంట్ త్వరగా వ్యాపించే సామర్ధ్యం కలిగి ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

BF.7 Variant: దూసుకొస్తున్న కరోనా కొత్త వేరియంట్.. బీఎఫ్.7తో ముప్పే అంటున్న నిపుణులు

BF.7 Variant: దేశంలో తగ్గుతుంది అనుకుంటన్న కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం కోరోనా వైరస్ అయిన ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఎఫ్.7. ఇది త్వరగా వ్యాపించే లక్షణం ఉండటంతోపాటు, చాలా ప్రమాదకరమైంది కూడా.

Woman Bank Manager: బ్యాంకు దోపిడీకి కత్తితో వచ్చిన దుండగుడు.. మహిళా మేనేజర్ ఎలా పోరాడిందో చూడండి.. వైరల్ వీడియో

ఇప్పటికే ఈ వేరియంట్ దేశంలోకి ప్రవేశించిందని గుజరాత్ బయోటెక్నాలజీ నిపుణులు సూచించారు. ఈ వైరస్ మొదట మంగోలియాలో పుట్టి, అక్కడ్నుంచి చైనాకు.. తర్వాత ఇతర దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 17 శాతం ఈ వేరియంట్‌కు సంబంధించినవే ఉన్నాయి. ఈ వైరస్ సోకితే కొందరిలో ఏ లక్షణాలు ఉండకపోవచ్చు. మరికొన్ని సార్లు తీవ్ర స్థాయిలో లక్షణాలు ఉండొచ్చు. ఈ వేరియంట్ యాంటీబాడీల్ని సమర్ధంగా ఎదుర్కోగలదు. తలనొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఛాతి నొప్పి, వినికిడి సమస్య, వణకడం వంటివి ఈ వేరియంట్ లక్షణాలు. ఈ వైరస్ త్వరగా వ్యాపించే అవకాశం ఉన్న దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Women’s IPL: త్వరలో మహిళల ఐపీఎల్.. అంగీకరించిన బీసీసీఐ.. వచ్చే మార్చి నుంచే ప్రారంభం

మరోవైపు దీపావళి పండుగ సందర్భంగా ఈ వేరియంట్ త్వరగా వ్యాప్తి చెంది, కేసులు పెరగొచ్చని వైద్యులు భావిస్తున్నారు. అయితే, మన దేశంలో ఇప్పటివరకు వచ్చిన అనేక సబ్ వేరియంట్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయని, ఇది కూడా అలాగే తక్కువ ప్రభావం చూపే అవకాశం కూడా ఉండొచ్చనే మరో వాదన కూడా వినిపిస్తోంది.