Woman Bank Manager: బ్యాంకు దోపిడీకి కత్తితో వచ్చిన దుండగుడు.. మహిళా మేనేజర్ ఎలా పోరాడిందో చూడండి.. వైరల్ వీడియో

బ్యాంకు దోపిడీకి వచ్చిన దుండగుడికి మహిళా మేనేజర్ చుక్కలు చూపించింది. కత్తితో బెదిరిస్తున్నా భయపడకుండా చిన్న టూల్‌తో పోరాడింది. దీంతో దెబ్బకు అక్కడ్నుంచి పారిపోయాడు దుండగడు.

Woman Bank Manager: బ్యాంకు దోపిడీకి కత్తితో వచ్చిన దుండగుడు.. మహిళా మేనేజర్ ఎలా పోరాడిందో చూడండి.. వైరల్ వీడియో

Woman Bank Manager: బ్యాంకు దోపిడీకి వచ్చిన దుండగుడిని ధైర్యంగా ఎదుర్కొంది ఒక బ్యాంకు మేనేజర్. ఆమె పోరాటానికి జడిసి దుండగుడు పారిపోయిన ఘటన రాజస్థాన్, శ్రీ గంగా నగర్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

UP Shocker: భార్యతో సోదరుడికి వివాహేతర సంబంధం ఉందని అనుమానం.. అన్నను కొట్టి చంపిన తమ్ముడు

శనివారం స్థానిక మరుధార గ్రామీణ బ్యాంకులోకి ముసుగు ధరించిన ఒక దుండగుడు బ్యాగు, కత్తితో చొరబడ్డాడు. అక్కడ బ్యాంకు సిబ్బందిని కత్తితో బెదిరిస్తూ తన వెంట తెచ్చుకున్న బ్యాగులో, బ్యాంకులోని డబ్బు నింపాలి అని బెదిరించాడు. దీంతో గందరగోళం తలెత్తింది. ఈ క్రమంలో అతడి దగ్గరున్న ఒక కటింగ్ ప్లేయర్ లాంటి టూల్ కింద పడిపోయింది. ఈ దశలో అక్కడి అరుపులు విన్న బ్యాంకు మేనేజర్ పూనమ్ గుప్తా తన గదిలోంచి బయటకు వచ్చింది. దుండుగుడిని బెదిరించి, అతడికి ఎదురు నిలబడింది. అక్కడే తన చేతికి దొరికిన టూల్‌తో అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆ దుండగుడు కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా భయపడలేదు. ఆమెకు, అక్కడున్న మరికొందరు అండగా నిలబడ్డారు.

Pawan Kalyan – Chandrababu : పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ

దీంతో దుండగుడు చేసేదేంలేక అక్కడ్నుంచి పారిపోయాడు. దుండగుడు దోపిడీకి వచ్చిన సమయంలో బ్యాంకులో దాదాపు రూ.30 లక్షల క్యాష్ ఉంది. ఆమె పోరాడకుండా ఉంటే అతడు ఆ డబ్బు మొత్తం తీసుకుని వెళ్లిపోయేవాడు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. అతడిని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు వ్యక్తిగా గుర్తించారు. దుండగుడిపై పోరాడిన మహిళా మేనేజర్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.