Pawan Kalyan – Chandrababu : పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. విజయవాడలోని ఒక హోటల్‌లో పవన్‌ను చంద్రబాబు కలిశారు. 2019 ఎన్నికల తర్వాత ఇద్దరూ కలవడం ఇదే మొదటిసారి.

పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రత్వాన్ని వదులుకుని, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది

విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు.

విశాఖలో జరిగిన ఘటనలపై చంద్రబాబు సంఘీభావం తెలిపారు.

ఈ సమావేశంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా పాల్గొన్నారు.

పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా బీజేపీపై పొత్తుపై కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి ఇక దూరంగా ఉంటానన్న సంకేతాలు ఇచ్చారు.

ఇదే సమయంలో ఆయన చంద్రబాబు నాయుడితో చర్చించడంతో టీడీపీ-జనసేన మళ్లీ కలుస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

2019 ఎన్నికల తర్వాత వారు కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. విశాఖ పరిణామాలు, పోలీసుల చర్యలపై వారు చర్చించారు.