×
Ad

Pawan Kalyan – Chandrababu : పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. విజయవాడలోని ఒక హోటల్‌లో పవన్‌ను చంద్రబాబు కలిశారు. 2019 ఎన్నికల తర్వాత ఇద్దరూ కలవడం ఇదే మొదటిసారి.

1/7
పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రత్వాన్ని వదులుకుని, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది
2/7
విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు.
3/7
విశాఖలో జరిగిన ఘటనలపై చంద్రబాబు సంఘీభావం తెలిపారు.
4/7
ఈ సమావేశంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా పాల్గొన్నారు.
5/7
పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా బీజేపీపై పొత్తుపై కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి ఇక దూరంగా ఉంటానన్న సంకేతాలు ఇచ్చారు.
6/7
ఇదే సమయంలో ఆయన చంద్రబాబు నాయుడితో చర్చించడంతో టీడీపీ-జనసేన మళ్లీ కలుస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
7/7
2019 ఎన్నికల తర్వాత వారు కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. విశాఖ పరిణామాలు, పోలీసుల చర్యలపై వారు చర్చించారు.