×
Ad

Corona Cases : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 5,676 పాజిటివ్ కేసులు

గత 24 గంటల వ్యవధిలో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 5,676 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 37,093కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

  • Published On : April 11, 2023 / 02:54 PM IST

Corona Cases

Corona Cases : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వైరస్ చాపకింద నీరులా దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది. దేశంలో మరోసారి దేశంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా 5 వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వడం ఆందోలన కలిగిస్తోంది. దేశంలో కొత్తగా 5,676 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గత 24 గంటల వ్యవధిలో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 5,676 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 37,093కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా కేరళలో 13,745, మహారాష్ట్రలో 4,667, ఢిల్లీలో 2,338, తమిళనాడులో 2,099, గుజరాత్ లో 1,932, హార్యానాలో 1,928, కర్ణాటకలో 1,673, ఉత్తరప్రదేశ్ లో 1,282 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  మిగతా రాష్ట్రాల్లో వెయ్యికి లోపు యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Corona Heart Attack : కరోనా సోకిన వారికి గుండెపోటుతోపాటు అనేక రోగాలు!

ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి 4,42,00,079మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. 24గంటల వ్యవధిలో ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ లో ముగ్గురు చొప్పున, కేరళలో ఇద్దరు, గుజరాత్, హార్యానా, మహరాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మరణించారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 5,31,000కి చేరింది.

ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.08శాతం యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.73 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని తెలిపింది. సోమవారం కొత్తగా 5,880 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 220,66,23,885 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.