Omicron Variant In India: పెరిగిన ఒమిక్రాన్.. దేశంలో కొత్తగా 6వేలకు పైగా కరోనా కేసులు

ఒమిక్రాన్ రూపంలో దేశంలో కొత్త వేరియంట్ రాగా.. దేశంలో కొత్తగా 6వేల 984 కరోనా కేసులు నమోదయ్యాయి.

Omicron Variant In India: ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ రాగా.. ఇదే సమయంలో దేశంలో కొత్తగా 6వేల 984 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 247 మంది మరణించారు. ఇదే సమయంలో 8వేల 168 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దేశంలో ఇంకా 87,562 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,41,46,931 మంది కోవిడ్‌ను జయించారు.

కాగా, దేశంలో ఇప్పటి వరకు 4,76,135 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో 1,34,61,14,483 డోస్‌లు ఇవ్వబడ్డాయి. 6,984 కొత్త కేసుల్లో 3,377 కొత్త కేసులు కేరళకు చెందినవే. రాష్ట్రంలో 28 మరణాలు కూడా నమోదయ్యాయి. మరోవైపు, దేశంలో ఓమిక్రాన్ వేరియంట్‌ల కేసులు 61కి చేరుకున్నాయి. మంగళవారం ఢిల్లీలో నాలుగు కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో ఎనిమిది కొత్త కేసులు నమోదవగా.. దేశంలో ఓమిక్రాన్‌ కేసుల సంఖ్య 61కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో నలుగురికి ఓమిక్రాన్ సోకినట్లు గుర్తించామని, వారంతా ఇటీవల విదేశాలకు వెళ్లారని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. దేశంలో కేసులు తక్కువే నమోదవుతూ ఉన్నప్పటికీ ఒమిక్రాన్ మాత్రం టెన్షన్ పెడుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు