A selfie and images of the Earth, Moon
Aditya-L1- ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన ఆదిత్య ఎల్-1 తాజాగా భూమి, జాబిల్లి ఫొటోలు తీసింది. సూర్యుడి (Sun) రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో ఇటీవలే ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ఆదిత్య ఎల్-1ను పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ 63 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతకుముందు చంద్రయాన్-3 (Chandrayaan 3) రోవర్ ప్రయోగం కూడా విజయవంతమైంది. ఇప్పటికే రోవర్ తీసిన జాబిల్లికి సంబంధించిన పలు ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. ఇప్పుడు ఆదిత్య ఎల్-1 తీసిన ఫొటోలను విడుదల చేస్తోంది.
Selfie
లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్1) వద్దకు ఆదిత్య ఎల్-1 చేరుకునే పనిలో ఉంది. ఈ సమయంలోనే భూమి, జాబిల్లి ఫొటోలను, ఓ సెల్ఫీ ఫొటోను ఆదిత్య ఎల్-1 తీసింది. వీటిని ఇస్రో తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసి వివరాలు తెలిపింది. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావయొలెట్ ఇమేజర్ పరికరాలు సెల్ఫీ ఫొటోలో కనపడ్డాయి.
ఈ ఫొటోలను సెప్టెంబరు 4న తీసినట్లు ఇస్రో వివరించింది. సెప్టెంబరు 2న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టారు. 125 రోజుల తర్వాత లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్1) వద్దకు ఆదిత్య ఎల్-1 చేరుకుంటుంది.
Aditya-L1 Mission:
?Onlooker!Aditya-L1,
destined for the Sun-Earth L1 point,
takes a selfie and
images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy— ISRO (@isro) September 7, 2023