Arvind Kejriwal: E20 పెట్రోల్‌పై యుద్ధం.. ప్రధాని ఇంటి ముట్టడికి పిలుపు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన
E20 ఇంధనం అమల్లోకి తీసుకురావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- V Santhosh Kumar
- Updated on- August 1, 2026 / 04:14 PM IST
india will march to pm's residence over e20 kejriwal announces august 3 protest
- E20 పెట్రోల్‌పై పోరాటం
- ప్రధాని నివాసానికి మార్చ్
- సాధారణ పెట్రోల్ విక్రయాలు
Arvind Kejriwal: E20 ఇంధనం అమల్లోకి తీసుకురావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు సాధారణ పెట్రోల్ లేదా ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఎంచుకునే వెసులుబాటును తప్పనిసరిగా కల్పించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. కేంద్ర విధానానికి వ్యతిరేకంగా ప్రజా వినతిపత్రాలను సమర్పించేందుకు ఆగస్టు 3న ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి నిరసన ప్రదర్శన చేపడతామని శనివారం ప్రకటించారు.
Bombay High Court: దేశంలో చెత్త.. విదేశాల్లో శుభ్రమా?.. ప్రజల తీరుపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన టౌన్ హాల్ సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై తన వైఖరిని పదే పదే మారుస్తోందని విమర్శించారు. ఇథనాల్ వాడకం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడమే కాకుండా, భూమి, నీరు కలుషితమై రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాల కోసమే కేంద్రం ప్రజలపై బలవంతంగా E20 ఇంధనాన్ని రుద్దుతోందని, దీనివల్ల ఇథనాల్ దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ ఇంధన వినియోగం వల్ల వాహనాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్రం చెబుతున్న అధ్యయన నివేదికలను వెంటనే బహిర్గతం చేయాలని మాజీ సీఎం డిమాండ్ చేశారు. E20 పెట్రోల్ ధరలను తగ్గించడంతో పాటు సాధారణ పెట్రోల్ ధరలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సోమవారం మధ్యాహ్నం నుంచి సంతకాల సేకరణ ప్రారంభించి, ఆ తర్వాత 100 మందితో కలిసి లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకుని వినతిపత్రాలు అందజేస్తామని స్పష్టం చేశారు.
