RS.10 coins validity : రూ.10 నాణేం చెల్లుబాటు అవుతుందా? లేదా? : కేంద్రం కీలక ప్రకటన

రూ.10 నాణేం చెల్లుబాటు అవుతుందా? లేదా? అనే విషయంపై..కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.

Indian 10 rupees coins validity : రూ.10 నాణేల చెల్లుబాటు అవుతుందా? లేదా? అనే విషయంపై ప్రజలు గందరగోళంలో ఉన్నారు. భారత్ లో రూ.10 నాణేలు వాడుకలో ఉన్నా పలు షాపుల్లో గానీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్స్ లతో పాటు మాల్స్ కూడా తీసుకోవటంలేదు. ఇవి చెల్లవని చెప్పేస్తున్నారు. దీంతో ప్రజలు అసలు రూ.10నాణాలు చెల్లుతాయో లేదో అర్థంకాని అయోమయంలో ఉన్నారు. ఈ విషయంపై రాజ్యసభలో మంగళవారం (ఫిబ్రవరి 8,2022) రాజ్యసభలో చర్చకు వచ్చింది. రూ.10 నాణేం చెల్లుతుందా? లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు ఎంపీ ప్రశ్నించారు.

Also read : National project : కేంద్రం మరో షాక్‌..ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా..కేంద్రం నుంచి 60 శాతం నిధులే

రూ.10 నాణేల చెల్లుబాటుపై ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని మంత్రి సుస్పష్టం చేశారు. రూ.10 నాణేలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించి చలామణిలో ఉంచిందని తెలిపారు. అన్ని లావాదేవీలకు ప్రజలు ఈ నాణేలను వాడుకోవచ్చని సూచించారు. ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. ఎవరైనా రూ.10 నాణేలను స్వీకరించకపోతే ఫిర్యాదు చేయవచ్చని మంత్రి సూచించారు.

Also read : Karnataka Hijab : కర్ణాటక హిజాబ్ వివాదం..ముస్లిం మహిళలను చిన్న చూపు చూడొద్దన్న మలాలా

రూ.10 నాణేలను తీసుకోవడంలేదని ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందుతున్నాయనీ..దీని గురించి ఆర్‌బీఐ చర్యలు చేపడుతోంది.  ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను తొలగించడానికి  ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తోంది. నిస్సందేహంగా అన్ని లావాదేవీల్లో పది రూపాయల కాయిన్స్ తీసుకోవచ్చని ప్రజలకు చెబుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా దీనిపై ఎస్‌ఎంఎస్‌ అవగాహన ఉద్యమం నిర్వహిస్తోంది’’ అని కేంద్రమంత్రి పంకజ్‌ చౌదరి పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు