National project : కేంద్రం మరో షాక్‌..ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా..కేంద్రం నుంచి 60 శాతం నిధులే

రాష్ట్రాలకు కేంద్రం మరో షాక్‌ ఇచ్చింది. ఏసాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా..కేంద్రం నుంచి 60 శాతం నిధులే వస్తాయని తేల్చి చెప్పింది.

National project : కేంద్రం మరో షాక్‌..ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా..కేంద్రం నుంచి 60 శాతం నిధులే

Only 60% Funding For National Project Say Central Govt

Only 60% funding For National project say central Govt : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు షాకిచ్చే న్యూస్ చెప్పింది. ఇక నుంచి దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా లభించినా కేంద్రం నుంచి 60 శాతం మాత్రమే నిధులు వస్తాయని..గతంలో లాగా కేంద్రం నుంచి 90శాతం నిధులు రావని కేవలం 60శాతం నిధులు మాత్రమే వస్తాయని సుస్పష్టంగా కుండబద్దలు కొట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేయాలంటే..మిగిలిన 40 శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని తెలిపింది.

ఇంకా పలు నిబంధనలు కూడా విధించింది. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రమైనా ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలంటే రాష్ట్రం ఖర్చు పెట్టుకోవాల్సిన 40 శాతం వాటా నిధులు విడుదల చేసి ప్రాజెక్టుకు ఖర్చు చేస్తేనే…కేంద్రం నుంచి ఇవ్వాల్సిన 60 శాతం నిధులు విడుదల అవుతాయని తెలిపింది. ఈ కొత్త నిబంధనలకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది.

Also read : World Highest Chenab bridge : మేఘాలపై..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి లేటెస్ట్ ఫోటోలు

కాగా..ప్పటివరకు జాతీయ హోదా లభించిన సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు విడుదల చేసేది. కానీ ఈ కొత్త నిబంధనల ప్రకారం 90 శాతం కాస్తా 60 శాతానికి కుదించివేసింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై కేంద్రం వాటా 60 శాతానికి తగ్గిపోవడమే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రాలు పొందే నిధుల ప్రక్రియ సైతం మరింత కష్టంగా మారనుంది.

దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఆయా సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్నా ఆ సమయంలో నిధుల అందుబాటు, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం ఉంటుంది తప్ప జాతీయ హోదా కల్పించే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయి. అంటే కేంద్రం ప్రాజెక్టులమీద జాతీయ హోదా పేరుతో పెట్టే ఖర్చును తగ్గించుకోవటానికే ఈ ప్లాన్ అన్నట్లుగా తెలుస్తోంది.

Also read : Colombia Mudslide: కొలంబియాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

ఉమ్మడి ఏపీ విజభన సమయంలో పోలరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త నిబందనతో పోలవరానికి కేంద్రంనుంచి విడుదలయ్యే నిధుల్లో కోత తప్పదు. ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఏపీ ప్రజల కలగా పూర్తి అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 60 శాతం నిధులు మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ఇది పెద్ద దెబ్బఅనిచెప్పాలి. కాగా..భారత్ లోని ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లడాఖ్‌లలో మాత్రమే జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం నిధులు జారీ చేయనుంది.