Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ పై కీలక ప్రకటన చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. వాటిని నమ్మొద్దంటూ సూచన

ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది.

Indian Armed Forces

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించింది. తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడంతో 100మందికిపైగా ఉగ్రవాదులు మరణించారు. పాకిస్థాన్ – భారత్ ఉద్రిక్తతల సమయంలోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ లో వైమానిక దాడులను విజయవంతంగా నిర్వహించింది. తద్వారా పాకిస్థాన్ బెంబేలెత్తింది. ప్రస్తుతం పాకిస్థాన్ – ఇండియా దేశాలు సరిహద్దుల్లో కాల్పుల విరమణకు అంగీకరిచడంతో ఆపరేషన్ సిందూర్ ముగిసిందని అందరూ భావించారు. అయితే, తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేసింది.

Also Read: Spy Satellite: పాక్, చైనా ఆటలు ఇక సాగవ్.. సరిహద్దుల్లో నిఘాను పెంచడంపై భారత్ దృష్టి.. వచ్చే ఐదేళల్లో భూకక్ష్యలోకి 52నిఘా ఉపగ్రహాలు

ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందిస్తూ.. ‘‘ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళానికి అప్పగించిన పనులను ఖచ్చితత్వంతో, వృత్తి నైపుణ్యంతో విజయవంతంగా అమలు చేసింది. ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నందున తగిన సమయంలో అధికారికంగా వివరాలు వెల్లడిస్తాం. అనధికారిక, తప్పుడు సమాచారానికి ప్రజలు దూరంగా ఉండాలని’’ వాయుసేన కోరింది.

మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఉగ్రవాదంపై భారతదేశం ధృఢసంకల్పం, సైనిక శక్తి దృఢ సంకల్పానికి ఆపరేషన్ సిందూర్ కూడా నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, భారతదేశం రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి చిహ్నం. భారతదేశం ఉగ్రవాదంపై చర్య తీసుకున్నప్పుడల్లా, సరిహద్దు అవతలఉన్న భూమి కూడా ఉగ్రవాదులకు, వారి యజమానులకు సురక్షితంగా ఉండదని మేము చూపించాము” అని అన్నారు.