Spy Satellite: పాక్, చైనా ఆటలు ఇక సాగవ్.. సరిహద్దుల్లో నిఘాను పెంచడంపై భారత్ దృష్టి.. వచ్చే ఐదేళల్లో భూకక్ష్యలోకి 52నిఘా ఉపగ్రహాలు
అంతరిక్ష ఆధారిత నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి భారతదేశం రాబోయే ఐదు సంవత్సరాల్లో 52 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుందని

spy satellites
Spy Satellite: అంతరిక్ష ఆధారిత నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి భారతదేశం రాబోయే ఐదు సంవత్సరాల్లో 52 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుందని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACE) చైర్మన్ పవన్ కుమార్ గోయెంకా తెలిపారు. ఇందులో ప్రైవేట్ రంగం నుండి బలమైన భాగస్వామ్యం ఉంటుందని ఆయన అన్నారు.
గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్ 2025 సందర్భంగా గోయెంకా మాట్లాడుతూ.. భారత్ రక్షణ రంగం నిఘా సామర్థ్యాలను పెంచుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ద్వారా భారత్ ఉపగ్రహాలను ప్రయోగించింది. ప్రస్తుతం ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేస్తుంది. 52 ఉపగ్రహాల ప్రయోగంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించనుందని అన్నారు. ఈ ఉపగ్రహాలు భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఆధ్వర్యంలో శత్రువుల కదలికలను ట్రాక్ చేయడానికి, సరిహద్దులను పర్యవేక్షించడానికి, సైనిక కార్యకలాపాల సమయంలో సమన్వయాన్ని మెరుగు పర్చడానికి సహాయపడతాయని గోయెంకా పేర్కొన్నారు.
Also Read: వీరజవాన్ మురళీ నాయక్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని.. ఈ విధంగా తన దగ్గరికి రప్పించుకోవడం బాధాకరం..
ఈఓఎస్-09తో రాత్రివేళల్లోనూ నిఘా..
ఈఓఎస్-09 (RISAT-1B) రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈనెల 18వ తేదీ ఉదయం 6.59గంటలకు ఇస్రో ప్రయోగించనుంది. పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది. సీ-బ్యాండ్ సింథటిక్స్ ఎవర్చర్ రాడార్‌ను అమర్చిన ఈవోఎస్-09 ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అధిక రిజల్యూషన్‌తో కూడిన భూ ఉపరితల చిత్రాలను తీయగలదు. ఈ ఉపగ్రహం ద్వారా పాకిస్థాన్, చైనాలతో భారతదేశం కలిగిఉన్న సున్నితమైన సరిహద్దుల్లో నిఘాను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి వేళ్లలో, మంచు సమయాల్లోనూ భూ ఉపరితల చిత్రాలను స్పష్టంగా ఈ ఉపగ్రహం తీయగలదు.