వీరజవాన్ మురళీ నాయక్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని.. ఈ విధంగా తన దగ్గరికి రప్పించుకోవడం బాధాకరం..

మురళీ నాయక్ అంతిమయాత్రలో పవన్ కల్యాణ్, లోకేశ్ సహా మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

వీరజవాన్ మురళీ నాయక్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని.. ఈ విధంగా తన దగ్గరికి రప్పించుకోవడం బాధాకరం..

Pawan Kalyan

Updated On : May 11, 2025 / 12:40 PM IST

Jawan Murali Naik: భారత్ – పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ పార్థీవదేహాన్ని శనివారం రాత్రి స్వగ్రామమైన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం మురళీనాయక్ పార్ధివదేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. మురళీ నాయక్ తండ్రి పవన్ కల్యాణ్ ను హత్తుకొని కన్నీరు మున్నీరయ్యారు. పవన్, లోకేశ్ మురళీ నాయక్ తల్లిదండ్రులను దగ్గర కూర్చోబెట్టుకొని ఓదార్చారు.

Also Read: ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను హత్తుకొని కన్నీరుమున్నీరైన జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులు.. వారిని దగ్గర కూర్చొబెట్టుకొని ఓదార్చిన పవన్, లోకేశ్

మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50లక్షలు ఆర్థిక సహాయం, ఐదెకరాల భూమి, ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పవన్ కల్యాణ్, నారా లోకేశ్ చెప్పారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. వీర జవాన్ మురళీ నాయక్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. పవన్ ను ఈ విధంగా తన దగ్గరికి రప్పించుకోవటం బాధాకరం. పవన్ కల్యాణ్ ని చూసి మురళీ తల్లిదండ్రులు రోధించారు. నా బిడ్డ మీ అభిమాని అంటూ కిందపడి కన్నీరు మున్నీరయ్యారని సత్యకుమార్ తెలిపారు.

 

మురళీ నాయక్ అంతిమయాత్రలో పవన్ కల్యాణ్, లోకేశ్ సహా మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు అంతిమయాత్రలో పాల్గొని వీరుడా వందనం అంటూ నివాళులర్పించారు. ఇదిలాఉంటే.. వీరజవాను కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్‌ హామీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మురళీనాయక్‌ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.