బాలాకోట్ దాడి దృశ్యాలు ఇవే

ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. బాలాకోట్ దాడి దృశ్యాలతో కూడిన ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ని పురస్కరించుకుని ఐఏఎఫ్ మార్షల్ బహదూరియా ఈ

  • Publish Date - October 4, 2019 / 07:42 AM IST

ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. బాలాకోట్ దాడి దృశ్యాలతో కూడిన ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ని పురస్కరించుకుని ఐఏఎఫ్ మార్షల్ బహదూరియా ఈ

ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. బాలాకోట్ దాడి దృశ్యాలతో కూడిన ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ని పురస్కరించుకుని ఐఏఎఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ఈ ప్రమోషనల్ వీడియోని శుక్రవారం(అక్టోబర్ 4,2019) రిలీజ్ చేశారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ ఫోర్స్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. భారత వైమానిక యుద్ధ విమానాలు(మిరాజ్-2000) గాల్లోకి ఎగురుతున్న, ఉగ్రవాద శిబిరాలపై బాంబులు జారవిడుస్తున్న దృశ్యాలతో ఈ ప్రమోషనల్ వీడియోని రూపకల్పన చేశారు. ఫిబ్రవరి 26న మిరాజ్-2000 ఫైటర్లు.. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఉంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో ఏ విధంగా ఉగ్రదాడి జరిగింది… దానికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఏ విధంగా దాడులు చేసింది తెలుపుతూ వాయిస్ ఓవర్ ఉంది. 

వీడియో రిలీజ్ వేదికగా పాకిస్తాన్ కు ఐఏఎఫ్ చీఫ్ భదౌరియా హెచ్చరికలు పంపారు. పాక్ తన తీరుని మార్చుకోవాలన్నారు. చొరబాట్లు ఆపేయాలన్నారు. లేకపోతే బాలాకోట్ తరహా దాడులు రిపీట్ అవుతాయన్నారు.

భారత వాయుసేన దళాధిపతిగా ఇటీవలే భదౌరియా బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ మార్షల్ బీఎస్ దనోవా ఎయిర్ చీఫ్‌గా పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఆర్‌కే భదౌరియా బాధ్యతలు తీసుకున్నారు. బీఎస్ దనోవా హయాంలో ఎలాగైతే బాలాకోట్ దాడులు జరిగాయో భవిష్యత్తులో కూడా అలాంటి దాడులకు సిద్ధంగా ఉండాలని కొత్త బాస్ ఆర్‌కే భదౌరియా పిలుపునిచ్చారు. శత్రు దేశం నుంచి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఉందని ఆయన చెప్పారు. బాలాకోట్ దాడులకు ప్రిపేర్ అయ్యే ప్రణాళికను అమలు చేశామని, భవిష్యత్తులో జరిగే దాడులకు కూడా ఇప్పుడే సిద్ధంగా ఉంటున్నామని తెలిపారు. ఏ సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం భారత వాయుసేనకు ఉందన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తమకు పూర్తిగా సమాచారం ఉందని సరైన సమయంలో సరైన దాడులకు దిగుతామన్నారు.