Indian Army : మానవత్వాన్ని చాటుకున్న భారత ఆర్మీ జవాన్లు

భారత ఆర్మీ జవాన్లు మానవత్వాన్ని చాటుకున్నారు. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ముగ్గురు పిల్లలు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చారు.

Indian Army jawans : భారత ఆర్మీ జవాన్లు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ముగ్గురు పిల్లలు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చారు. పూంచ్‌ సెక్టార్‌లో ఆగస్టు 18న మధ్యాహ్నం 3 గంటల సమయంలో సరిహద్దు దాటుకుని భారత్‌లోకి ప్రవేశించారు.

అనుమానస్పదంగా తిరుగుతున్న పిల్లలు ఆర్మీ కంటబడ్డారు. ఆయితే వారిపై కాల్పులు జరపకుండా సంయమనం పాటించారు. చేపల వేటకు వెళ్లి దారితప్పినట్లు పిల్లలు చెప్పారు. ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఆ పిల్లలను ఆర్మీ జవాన్లు చేరదీసి భోజనం పెట్టారు. దుస్తులు ఇచ్చారు. వారిని సురక్షితంగా పంపిస్తామని అధికారులు వెల్లడించారు.

భారత ఆర్మీ గతేడాది సెప్టెంబర్ లో ముగ్గురు చైనీయులకు సాయం చేసింది. నార్త్ సిక్కిం పర్వత ప్రాంతంలో 17,500 అడుగులు ఎత్తున దారి తప్పిన ముగ్గురు చైనీయులను ఆర్మీ కాపాడింది. వైద్యం సాయం కూడా అందించింది.

ట్రెండింగ్ వార్తలు