Indian Army: గడ్డకట్టే మంచులో వాలీబాల్ ఆడుతున్న భారత సైనికులు

దేశ రక్షణ కోసం ఎటువంటి వాతావరణాన్ని లెక్కచేయని సైనికులు, కాస్త విరామం దొరకడంతో వాలీ బాల్ ఆట ఆడారు.

Indian Army: హిమాలయా పర్వతాల నడుమ.. గడ్డకట్టే చలి..సముద్ర మట్టానికి వందల అడుగుల ఎత్తులో.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య.. మనిషి బ్రతకడమే కష్టం. ఆ చలి తీవ్రతను చూసి శత్రుదేశాల సైనికులకు వెన్నులో ఒణుకు పుట్టి వెనుదిరిగి వెళ్లిపోయారు. అటువంటి అతిశీతల, ప్రతికూల వాతావరణంలో భారత సైనికులు ఏకంగా ఆటలు ఆడుతున్నారు. దేశ రక్షణ కోసం ఎటువంటి వాతావరణాన్ని లెక్కచేయని సైనికులు, కాస్త విరామం దొరకడంతో వాలీ బాల్ ఆట ఆడారు. భారత సైనికులు రెండు టీంలుగా ఏర్పడి వాలీ బాల్ ఆడుతున్న దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: Turkmenistan: “నరకానికి ప్రవేశ ద్వారం” మూసివేయండన్న దేశాధ్యక్షుడు

ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. “నేను చూసిన బెస్ట్ వింటర్ ఒలింపిక్స్ ఇవే” అంటూ అవనీష్ శరణ్ ఆ వీడియోను షేర్ చేశారు. అందులో ఒక టీం పాయింట్ కూడా సాధించి సంబరాలు కూడా చేసుకున్నారు. సైనికులు వాలీ బాల్ ఆడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది చూసిన నెటిజన్లు.. సైనికుల ధీరత్వాన్ని కొనియాడుతున్నారు. “కేవలం భారత సైనికులకు మాత్రమే ఇది సాధ్యం” అంటూ ఒకరు కామెంట్ చేయగా.. వెన్ను చూపని వీరులకు వెన్నులో ఒణుకు పుట్టించే చలి కూడా లెక్కలేదు” అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Also read: Monkey Steal food: ఆహారం కోసం అపార్ట్మెంట్ 22 ఫ్లోర్ కు చేరుకున్న కోతి

ట్రెండింగ్ వార్తలు