Turkmenistan: “నరకానికి ప్రవేశ ద్వారం” మూసివేయండన్న దేశాధ్యక్షుడు

తుర్కమెనిస్థాన్ లోని "దర్వాజా" దాదాపు ఏభై ఏళ్లుగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. "దర్వాజా" అనేది ఏళ్లకేళ్లుగా మండుతున్న ఒక అగ్ని బిలం.

Turkmenistan: “నరకానికి ప్రవేశ ద్వారం” మూసివేయండన్న దేశాధ్యక్షుడు

Door To Hell

Turkmenistan: ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో వింత పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అలా తుర్కమెనిస్థాన్ లోని “దర్వాజా” దాదాపు ఏభై ఏళ్లుగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. “దర్వాజా” అనేది ఏళ్లకేళ్లుగా మండుతున్న ఒక అగ్ని బిలం. తుర్కమెనిస్థాన్ పర్యాటకాభివృద్ధికి తోడ్పడిన ఈ దర్వాజా అగ్ని బిలాన్ని మూసివేయాలంటూ ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. ఏళ్లకేళ్లుగా పర్యాటకులను ఆకర్శించిన ఈ ప్రాంతం ఇప్పుడు తుడుచుపెట్టుకు పోతుండడంతో దేశ విదేశాల్లోని పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. తుర్కమెనిస్తాన్ లో వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఎడారిలో.. 70 మీటర్ల వ్యాసం, 30 మీటర్ల లోతులో ఏర్పడ్డ ఈ అగ్నిబిలం వెనుక చిన్న చరిత్ర ఉంది.

Also read: Monkey Steal food: ఆహారం కోసం అపార్ట్మెంట్ 22 ఫ్లోర్ కు చేరుకున్న కోతి

1970 దశకంలో సోవియట్ అధీనంలో ఉన్న తుర్కమెనిస్తాన్ లో.. పలు చోట్ల చమురు నిల్వలు ఉన్నట్లు సోవియట్ ఇంజినీర్లు అంచనా వేశారు. అందుకోసం ఎడారిలోని ఒక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ భూగర్భ పరిశోధనలు నిర్వహించారు. అయితే అనుకున్నట్టుగా అక్కడ ఆయిల్ నిల్వలు లేకపోగా, పెద్ద ఎత్తున సహజ గ్యాస్ నిల్వలు బయటపడ్డాయి. కొంత విషవాయువులతో కూడిన ఆ గ్యాస్ ఎందుకూ పనికిరాదని తేల్చిన ఇంజినీర్లు..ఆ గ్యాస్ ను కట్టడి చేసేందుకు నిప్పు పెట్టారు. మంటలు వెలిగి గ్యాస్ పూర్తిగా తగ్గిపోతుందని భావించిన ఇంజినీర్లు.. వారం, నెలలు గడిచినా ఆ మంటలు మండుతూనే ఉండడంతో ఇక అక్కడ ఏ పనులు చేపట్టలేదు. ఇంతలో అక్కడున్న నేల కొద్దికొద్దిగా కుంగుతూ పెద్ద గుంత ఏర్పడింది. అయినా మంటలు మాడుతూనే ఉన్నాయి. ఆ మంటల తీవ్రత ఎంతలా ఉందంటే.. నిశిరాత్రి వేళ.. సుమారు 40-60 కిలోమీటర్ల దూరం నుంచి చూసినా మంటల వెలుగు కనిపిస్తుండేదని స్థానికులు చెబుతుండేవారు.

Also read: No Name Station: పేరులేని రైల్వే స్టేషన్ మన దేశంలోనే

దాదాపు 50 ఏళ్లకు పైగా మంటలు వెలుగుతూనే ఉన్న ఈ ప్రాంతానికి స్థానికులు “దర్వాజా” అని పేరు పెట్టారు. దర్వాజా అంటే ద్వారం/తలుపు అని అర్ధం. మంటలు నరకానికి సూచికంగా భావించే తుర్కమెన్ వాసులు.. అక్కడ మండుతున్న మంటలు నరకానికి ప్రవేశ ద్వారం అంటూ ప్రచారం చేసుకునేవారు. ఈ ప్రాంతానికి వచ్చే విదేశీ పర్యాటకులు సైతం దీన్ని “gateway to hell” or “Door to Hell” అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఈ మంటల కారణంగా స్థానికంగా కాలుష్యం పెరిగిపోయి, ప్రజల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని అక్కడి పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ అగ్ని బిలాన్ని చూసేందుకు వచ్చే పర్యాటక ఆదాయం కంటే అందులో ఉన్న గ్యాస్ ను అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుందని తుర్కమెన్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ నరక ప్రవేశ ద్వారాన్ని మూసివేయాలని ఆ దేశాధినేత ఆదేశించారు.

Also Read: Fake Promotion: నకిలీ జీ.ఓతో ఐదుగురు అధికారులకు ఐఏఎస్ గా ప్రమోషన్