Fake Promotion: నకిలీ జీ.ఓతో ఐదుగురు అధికారులకు ఐఏఎస్ గా ప్రమోషన్

ఐదుగురు అధికారులకు పదోన్నతి వచ్చిందంటూ ఓ నకిలీ జీఓ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త చూసిన ఆ ఐదుగురు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.

Fake Promotion: నకిలీ జీ.ఓతో ఐదుగురు అధికారులకు ఐఏఎస్ గా ప్రమోషన్

Maharashtra

Fake Promotion: “ఐదుగురు అడిషనల్ స్థాయి అధికారులకు పూర్తిస్థాయి ఐఏఎస్ లుగా పదోన్నతులు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు అటవీ మరియు రెవిన్యూశాఖ జాయింట్ సెక్రటరీ మాధవ్ వీర్ ప్రభుత్వ జీఓను విడుదల చేశారు”. ఈ వార్త చూసిన ఆ ఐదుగురు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది ఒక “నకిలీ ప్రభుత్వ ఆర్డర్”. పదోన్నతి గురించి మచ్చుకైనా సమాచారం లేకపోవడం, ఉన్నట్టుండి ప్రమోషన్ రావడంతో ఆ ఐదుగురు అధికారులు కాస్త కంగారు పడ్డారు. ఐదుగురు అధికారులకు పదోన్నతి వచ్చిందంటూ ఓ నకిలీ జీఓ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also read: Child Reporter: రోడ్ల దుస్ధితిని వివరిస్తూ న్యూస్ రిపోర్టర్ గా మారిన చిన్నారి బాలిక

ప్రభుత్వానికి సంబంధించి ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్డర్ తమ కార్యాలయం నుంచి వెలువరించినట్లుగా వచ్చిన ఆ నకిలీ ఆర్డర్ పై చర్యలు తీసుకోవాలని రెవిన్యూశాఖ జాయింట్ సెక్రటరీ మాధవ్ వీర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ జీఓ సృష్టించి ప్రచారం చేస్తున్నవారిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో అదనపు జిల్లా కలెక్టర్లగా పనిచేస్తున్న వారు.. నకిలీ జీఓ ప్రకారం ఏఏ స్థాయికి చేరుకున్నారంటే..

Also read: Viral News: రైలు వస్తుండగా 9 నెలల చిన్నారితో సహా పట్టాలపై పడిపోయిన తల్లి

ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న రాందాస్ ఖేద్కర్, రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. గడ్చిరోలి అదనపు జిల్లా కలెక్టర్ ఉన్మేష్ మహాజన్.. గోండియా జిల్లా మేజిస్ట్రేట్‌గా పదోన్నతి పొందారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సంకేత్ చవాన్.. ఏ గ్రేడ్ స్థాయి అదనపు కమిషనర్ గా పదోన్నతి పొందగా, అమరావతి అదనపు జిల్లా కలెక్టర్ మనీషా వాజ్.. అదనపు మున్సిపల్ కమిషనర్‌గా ప్రమోట్ అయ్యారు. భండారా అదనపు కలెక్టర్ గా ఉన్న ధనంజయ్ నికమ్‌ కు కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. నకిలీ జీఓ సృటించిన అజ్ఞాత వ్యక్తిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నకిలీ జీఓ సృష్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: New YEZDI bikes: భారత మార్కెట్లోకి దూసుకొచ్చిన yezdi బైక్స్