Viral News: రైలు వస్తుండగా 9 నెలల చిన్నారితో సహా పట్టాలపై పడిపోయిన తల్లి

9 నెలల చిన్నారితో సహా రైలు పట్టాలపై పడిపోయిన మహిళను రైల్వే అధికారులు రక్షించిన ఘటన తమిళనాడులోని కాట్పాడి రైల్వే జంక్షన్ వద్ద చోటుచేసుకుంది

Viral News: రైలు వస్తుండగా 9 నెలల చిన్నారితో సహా పట్టాలపై పడిపోయిన తల్లి

Train

Updated On : January 13, 2022 / 4:27 PM IST

Viral News: రైలు పట్టాలు దాటుతూ పట్టుతప్పి పట్టాలపై పడిపోయిన ఓ మహిళ తృటిలో ప్రాణాలతో బయటపడింది. 9 నెలల చిన్నారితో సహా రైలు పట్టాలపై పడిపోయిన మహిళను రైల్వే అధికారులు రక్షించిన ఘటన తమిళనాడులోని కాట్పాడి రైల్వే జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. యువరాణి అనే 37 ఏళ్ల మహిళ తన 9 నెలల చిన్నారితో సహా.. కాట్పాడి రైల్వే జంక్షన్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. పట్టాలు దాటుతున్న సమయంలో కాలుజారి బిడ్డతో సహా యువరాణి పట్టాలపై పడిపోయింది.

Also Read: New YEZDI bikes: భారత మార్కెట్లోకి దూసుకొచ్చిన yezdi బైక్స్

అదే సమయంలో ఆ ట్రాక్ పై ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు దూసుకువచ్చింది. వేగంగా వస్తున్న రైలును గమనించిన యువరాణి, షాక్ కు గురై.. పట్టాలపైనే ఉండిపోయింది. అది గమనించిన రైల్వే అధికారులు రైలుని నిలిపివేశారు. పట్టాలు, రైలు మధ్యలో చిక్కుకున్న యువరాణిని, చిన్నారిని హుటాహుటిన రైల్వే సిబ్బంది రక్షించారు. ఈఘటనలో చిన్నారి క్షేమమంగా బయటపడగా.. మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్పృహ కోల్పోవడంతోనే యువరాణి పట్టాలపై పడిపోయిందని రైల్వే అధికారులు వెల్లడించారు. గాయపడిన ఆమెను రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Also read: Bandi Sanjay: సీఎం కేసీఆర్ కు బండి కౌంటర్, 11 హామిలు నెరవేర్చాలని డిమాండ్