Bandi Sanjay: సీఎం కేసీఆర్ కు బండి కౌంటర్, 11 హామిలు నెరవేర్చాలని డిమాండ్

భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గతంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులకు ఇచ్చిన హామీలలో 11 హామీలను ప్రస్తావిస్తూ సంజయ్ ఈ లేఖ రాశారు

Bandi Sanjay: సీఎం కేసీఆర్ కు బండి కౌంటర్, 11 హామిలు నెరవేర్చాలని డిమాండ్

Bandi

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వవిధానాలతో రైతులకు నష్టం కలుగుతుందంటూ బుధవారం సీఎం కేసీఆర్ ప్రధాని మోదికి లేఖ రాసిన నేపథ్యంలో.. అందుకు ప్రతిగా భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గతంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులకు ఇచ్చిన హామీలలో 11 హామీలను ప్రస్తావిస్తూ సంజయ్ ఈ లేఖ రాశారు. కేంద్రాన్ని ప్రశ్నించే ముందు రాష్ట్రంలో రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఈసందర్భంగా బండి సంజయ్ ప్రశ్నించారు. జీవో 317 అంశన్ని పక్కదారి పట్టించేందుకే ఎరువుల అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారని బండి సంజయ్ విమర్శించారు.

Also Read: Fake Call Center: అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టురట్టు

బండి సంజయ్ బహిరంగ లేఖ ప్రకారం:
1. 2017 ఏప్రిల్ 13న మీరు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువులను సరఫరా చేయాలి.
2. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలి.
3. వడ్లు, పత్తి, మొక్కజొన్నసహా రాష్ట్రంలో రైతులు పండించే పంట ఉత్పత్తులకు క్వింటాల్ కు రూ.500 చొప్పున ‘బోనస్’ ప్రకటించాలి.
4. కేంద్రం కేటాయించిన నిధులను తక్షణమే ఖర్చు చేసి రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించడంతోపాటు పంటల ప్రణాళికను ప్రకటించాలి.
5. వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను తక్షణమే అమలు చేయాలి. పార్టీ కార్యకర్తలకు గాకుండా అర్హులైన రైతులకు మాత్రమే వాటిని అందించాలి.
6. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాలీహౌజ్ సబ్సిడీని పునరుద్దరించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు అదనపు పాలీహౌజ్ ల నిర్మాణానికి ప్రోత్సాహకం అందించాలి.
7. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి.
8. విత్తన సబ్సిడీని పూర్తిగా అమలు చేయాలి. నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టాలి.
9. అకాల వర్షాలకు నష్టపోతున్న రైతాంగానికి ఆదుకునేందుకు ‘క్రాప్ ఇన్సూరెన్సు’ పథకాన్ని అమలు చేయాలి.
10. మార్కెట్లో ‘ఈ-నామ్’ పద్దతిని ప్రవేశపెట్టి రైతులకు మేలు చేయాలి.
11. బిందు సేద్యంలో భాగంగా ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి.

సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చాలని మొత్తం 6 పేజీలు కలిగిన బహిరంగ లేఖలో బండి సంజయ్ వివరించారు.

Also read: UP Election 2022 : బీజేపీకి షాక్‌‌లు…ఉత్సాహంలో సమాజ్‌‌వాది పార్టీ