Fake Call Center: అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టురట్టు

మొహాలీ, పంజాబ్ కి చెందిన ఏడుగురు సభ్యులున్న ముఠా, అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తు వినియోగదారులను మోసం చేస్తున్నారు

Fake Call Center: అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టురట్టు

Callcenter

Fake Call Center: విదేశీ ప్రయాణికులు, అంతర్జాతీయ క్రెడిట్ కార్డు దారులే లక్ష్యంగా..మోసాలకు పాల్పడుతున్న నకిలీ కాల్ సెంటర్ పై సైబరాబాద్ పోలీసులు దాడి చేశారు. బ్యాంకు వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి క్రెడిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించి కోట్ల రూపాయలు కాజేస్తున్న నకిలీ అంతర్జాతీయ కాల్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం తెలిపిన వివరాలు మేరకు..మొహాలీ, పంజాబ్ కి చెందిన ఏడుగురు సభ్యులున్న ముఠా, అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తు వినియోగదారులను మోసం చేస్తున్నారు.

Also read: Radha : మళ్ళీ తెరపై కనపడనున్న అలనాటి అందాల తార రాధ

విదేశీ ప్రయాణికుల కార్డులు, అంతర్జాతీయ బ్యాంకుల క్రెడిట్ కార్డులే లక్ష్యంగా వీరు మోసాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని, పూర్తి వివరాలు ఇస్తే వెంటనే యాక్టివేట్ చేస్తామని నమ్మబలుకుతారు. అనంతరం ఆ వివరాలతో ఆయా కార్డులను క్లోనింగ్ చేసి..ఆన్ లైన్ ద్వారా విదేశాల్లో ఆ కార్డులను విక్రయిస్తున్నారు. ముఠాకి చెందిన నవీన్ బొటాని కీలక సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు వీరు ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు తెలిపారు.

Also read:UP Election 2022 : బీజేపీకి షాక్‌‌లు…ఉత్సాహంలో సమాజ్‌‌వాది పార్టీ

అడ్డుఅదుపులేకుండా సాగిన వీరి మోసాలకు విదేశీయులు భయపడిపోతున్నారని పోలీసులు పేర్కొన్నారు. విదేశీ క్రెడిట్ కార్డ్ కంపెనీలకు ఫ్రాంచైజ్ గా ఉన్న పలు భారతీయ బ్యాంక్ లకు నవీన్ గ్యాంగ్ టోకరా వేసినట్లు పోలీసులు గుర్తించారు. భారత్ లో 80 మందితో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ఈ ముఠాకు..దుబాయ్ లో ఉన్న మరో రెండు ముఠాలు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం కాల్ సెంటర్ పై జరిపిన దాడుల్లో రూ.1 కోటి 11 లక్షల నగదు ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Also read: Health : తింటే చేదుగా ఉన్నా…ఆరోగ్యానికి మాత్రం మేలు చేస్తాయి…