Child Reporter: రోడ్ల దుస్ధితిని వివరిస్తూ న్యూస్ రిపోర్టర్ గా మారిన చిన్నారి బాలిక

తమ ఊరిలో రోడ్ల దుస్థితిపై ఐదేళ్ల చిన్నారి ఏకంగా రిపోర్టర్ గా మారిపోయి..అధికారులను నిలదీస్తున్న దృశ్యం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది

Child Reporter: రోడ్ల దుస్ధితిని వివరిస్తూ న్యూస్ రిపోర్టర్ గా మారిన చిన్నారి బాలిక

Child Reporter

Child Reporter: ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అయినపుడు.. వయసుతో సంబంధం లేకుండా ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. తమ ఊరిలో రోడ్ల దుస్థితిపై ఐదేళ్ల చిన్నారి ఏకంగా రిపోర్టర్ గా మారిపోయి..అధికారులను నిలదీస్తున్న దృశ్యం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాశ్మీర్ వ్యాలీలో ఓ చిన్న గ్రామంలో నివసిస్తున్న హఫీజా అనే ఐదేళ్ల చిన్నారి.. తమ గ్రామంలో రోడ్ల పరిస్థితిని వివరిస్తూ రిపోర్టర్ అవతారం ఎత్తింది. చేతిలో చిన్న మైక్ పట్టుకుని, కెమెరా మ్యాన్(హఫీజా తల్లి)ను వెంటబెట్టుకుని.. బురదమయం అయిన తమ గ్రామ విధుల పరిస్థితిని హఫీజా వివరించింది.

Also read: Viral News: రైలు వస్తుండగా 9 నెలల చిన్నారితో సహా పట్టాలపై పడిపోయిన తల్లి

భారీ వర్షాలకు రోడ్లు రూపురేఖలు కోల్పోయాయని, రోడ్లు ఇలా ఉంటే తమ ఇంటికి చుట్టాలు ఎలా వస్తారంటూ ఆ చిన్నారి ప్రశ్నించిన తీరు అందరిని ఆలోచింపజేస్తుంది. బురదగా ఉన్న రోడ్డు పై నడుచుకుంటూ..చుట్టూ ఉన్న గుంతలు, గులక తేలిన రోడ్డును వీడియోలో చూపించింది చిన్నారి. అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలనీ హఫీజా కోరింది. ఇక చివరగా.. ఇటువంటి సమస్యలతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తానని.. అందాకా.. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాలనీ హఫీజా నెటిజన్లను కోరింది.

Also read: New YEZDI bikes: భారత మార్కెట్లోకి దూసుకొచ్చిన yezdi బైక్స్

ఇక ఈ వీడియోను హఫీజా తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో సూపర్ వైరల్ అయింది. చిన్నారి మాటలకు ఫిదా అయిన నెటిజన్లు.. చిన్నారి రిపోర్టర్ ఎంతో దైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అంటూ ప్రశంసించారు. “చిన్నారి చూపిన చొరవలో కాస్తైనా అధికారులు చూపిస్తే రోడ్లు బాగుపడతాయని” ఒకరంటే..”ఈ వీడియో జమ్మూ కాశ్మీర్ అధికారులకు చేరి.. మీ ఊరికి త్వరగా రోడ్లు రావాలని కోరుకుంటున్న” అని మరొకరు కామెంట్ చేశారు.

Also Read: Bandi Sanjay: సీఎం కేసీఆర్ కు బండి కౌంటర్, 11 హామిలు నెరవేర్చాలని డిమాండ్