భారత వాయుసేనకు మహారాష్ట్ర అసెంబ్లీ అభినందనలు 

  • Publish Date - February 26, 2019 / 07:28 AM IST

ముంబయి : పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులపై సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ  దాడిలో వందలమంది ఉగ్రవాదులు మరణించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో భారత వాయుసేనను అభినందిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అత్యంత ధైర్యసాహసాలతో పాక్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన భారత వాయుసేన పైలెట్లను అభినందిస్తూ అసెంబ్లీ తీర్మానించింది.
Also Read : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి

ఈ తీర్మానాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రవేశపెట్టగా విపక్షాల నేతలందరూ మద్ధతు పలికారు. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా  “మన సైనిక దళాలను చూసి మనం గర్వపడాలనీ..మన సైనికులు త్యాగాలు భారతీయులు మరచిపోరానీ..భారత సైనికులు ధైర్య సాహసాలు అసామాన్యమైనవి సీఎం ఫడ్నీవీస్ కీర్తించారు.
Also Read : సర్జికల్ ఎటాక్: పాక్ చేస్తానంది మనం చేసి చూపెట్టాం

12 మిరాజ్ యుద్ధ విమానాలతో పాక్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానికా దళం విరుచుకుపడింది.పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయు దళం మిరాజ్ 2000 యుద్ధ విమానాలుతో పాకిస్తాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి కీలకంగా ఉపయోగడిన మిరాజ్2000 పాక్ పై విరుచుకుపడి పుల్వామా దాడి తరువాత పాక్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నభారతీయుల్లో ఆనందాన్ని నింపాయి.  
Also Read : కుర్రాళ్లు అదరగొట్టారు : సర్జికల్ స్ట్రైక్‌పై క్రికెటర్ల కామెంట్స్