Galwan Valley : గల్వాన్ లోయలో జాతీయ జెండా ఎగురవేసిన భారత ఆర్మీ

2019లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తూర్పు లడఖ్ లోని గాల్వాన్‌ వ్యాలీలో న్యూఇయర్ రోజున భారత్ సైన్యం కూడా జాతీయ పతాకాన్ని ఎగురువేసినట్టు సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

Galwan Army

Galwan Valley :  2019లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తూర్పు లడఖ్ లోని గాల్వాన్‌ వ్యాలీలో న్యూఇయర్ రోజున భారత్ సైన్యం కూడా జాతీయ పతాకాన్ని ఎగురువేసినట్టు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఎస్ఐ‌జీ716 రైఫిల్స్ గల్వాన్ లోయలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రివర్ణ పతాకంతో పాటు టిబెట్ జెండాను కూడా సైనికులు ఎగురువేసినట్టు ఫోటోల్లో కనిపిస్తోంది.

అయితే 2020 జూన్‌లో చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన గల్వాన్‌ లోయలో చైనా సైన్యం కొత్త సంవత్సరం సందర్భంగా తమ జాతీయ జాతీయ జెండాను ఎగురు వేసి.. ఇక్కడ నుంచే చైనీయులకు సీపీఎల్ఏ సైన్యం కొత్త ఏడాది శుభాకాంక్షలను తెలియజేసినట్టు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వీడియోను విడుదల చేసింది.

ఈ సమయంలోనే సమయంలో భారత జవాన్లు గల్వాన్ లోయలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన ఫొటోలు బయటకొచ్చాయి. కాగా,గల్వాన్‌ లోయలో చైనా పతాకావిష్కరణపై భారత సైన్యం ఇప్పటికే వివరణ ఇచ్చింది. చైనా పతాకం వివాద రహిత ప్రాంతంలోనే ఎగిరిందని తెలిపారు. 2020 జూన్‌లో ఘర్షణలు జరిగిన ప్రాంతం దగ్గర కాదని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది.

ALSO READ Pangong Lake : భారత్ దెబ్బకు భయపడి..పాంగాంగ్ సరస్సుపై బ్రిడ్జి నిర్మిస్తోన్న చైనా