Corona Cases 11zon
Corona Cases : దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,271 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఇదే సమయంలో 285 మంది ప్రాణాలు ప్రాణాలు విడువగా 11,376 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,44,307కు చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,918గా ఉంది.
చదవండి : Corona Vaccine : వ్యాక్సిన్ వేయించుకోకపోతే..బస్సులోకి అనుమతి లేదు
కొత్తగా నమోదైన మరణాలతో 4,63,503కి చేరుకుంది. ఇప్పటివరకు 3,38,37,859 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో సగానికి పైగా కేరళలోనే వెలుగు చూశాయి. ఇక్కడ 6,468 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 23 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 112.01 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
చదవండి : Corona Virus: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం