Corona Virus: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం

భారత్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,850 కేసులు నమోదయ్యాయి.

Corona Virus: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం

Corona

Corona Virus: భారత్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,850 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 555 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. దేశంలో లక్షా 36వేల 308కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 274 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది.

ప్రస్తుతం రికవరీ రేటు 98.26 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. డైలీ పాజిటివిటీ రేటు ఒక్క శాతానికి పెరిగింది. ఇప్పటివరకు దేశం మొత్తంపై కరోనా కేసుల సంఖ్య 3,44,26,036కి చేరగా మరణాల సంఖ్య 4లక్షల 63వేల 245కి పెరిగింది. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 12,403 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3కోట్ల 38లక్షల 26వేల 483కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Ravi Shastri : ఫ్రీ అయ్యా..హ్యాపీగా మందు కొడదాం రండి..మీమ్స్ క్రియేటర్స్ కు రవిశాస్త్రి పిలుపు

దేశంలో కేంద్రం ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. దేశవ్యాప్తంగా 111కోట్ల 40లక్షల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో 58,42,530 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.

Chicken : మాంసం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్ ధర