హైపర్ సోనిక్ క్షిపణులే లక్ష్యంగా డిఆర్‌డిఓ.. కొత్త జనరేషన్ మిస్సైళ్ల‌తో 3 సమస్యలు తప్పవంటున్న నిపుణులు!

భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) డీఆర్డీఓ భవిష్యత్తులో హైపర్ సోనిక్ క్షిపణులే లక్ష్యంగా దూసుకెళ్తోంది. అందులో భాగంగానే ప్రపంచ దేశాలతో పాటు హైపర్ సోనిక్ ఆయుధాల అభివృద్ధి రేసులో భారత్ కూడా చేరింది. దేశాలన్నీ ఈ హైపర్ సోనిక్ ఆయుధాల కోసం పోటీపడటానికి ఒకటే కారణం.

Indian DRDO Aims For Hypersonic Missiles : భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) డీఆర్డీఓ భవిష్యత్తులో హైపర్ సోనిక్ క్షిపణులే లక్ష్యంగా దూసుకెళ్తోంది. అందులో భాగంగానే ప్రపంచ దేశాలతో పాటు హైపర్ సోనిక్ ఆయుధాల అభివృద్ధి రేసులో భారత్ కూడా చేరింది. దేశాలన్నీ ఈ హైపర్ సోనిక్ ఆయుధాల కోసం పోటీపడటానికి ఒకటే కారణం.. ప్రస్తుతమున్న బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాడానికే.. ఇదే విషయాన్ని భారతీయ క్షిపణి నిపుణులు ఒకరు వెల్లడించారు.

ఇప్పటికే అక్టోబర్ 1, 2019లో జరిగిన నేషనల్ డే మిలటరీ పరేడ్ సమయంలో డీఎఫ్-17 మిస్సైల్ ప్రదర్శించిన డ్రాగన్ చైనా.. తామే హైపర్ సోనిక్ ఆయుధాలు కలిగిన తొలిదేశంగా బహిరంగంగానే ప్రకటించుకుంది. డిసెంబర్ 2019లో రష్యా కూడా అవాన్ గార్డ్ మిస్సైల్ గురించి ప్రకటన చేసింది. రష్యా మీడియా ప్రకారం.. అవాన్ గార్డ్ క్షిపణి అనేది.. అవాన్‌గార్డ్ ఒక హైపర్సోనిక్ బూస్ట్-గ్లైడ్ వాహనంతో కూడిన వ్యూహాత్మక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ. వాతావరణంలో ధ్వని వేగానికి కంటే 20 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలదు.
భారత్ కూడా కొంతకాలంగా హైపర్ సోనిక్ టెక్నాలజీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కొన్ని వైఫల్యాలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. సెప్టెంబర్ 2020లో, డీఆర్డీఓ దేశీయంగా అభివృద్ధి చెందిన హైపర్సోనిక్ టెక్నాలజీ డెమన్‌స్ట్రేటర్ వెహికల్ (HSTDV)ను విజయవంతంగా పరీక్షించి ఎలైట్ హైపర్సోనిక్ క్లబ్‌లో చేరింది. రాబోయే నాలుగైదు ఏళ్లలో పూర్తి హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేయాలని డిఆర్‌డిఓ ఇప్పుడు చూస్తోంది.

ఈ ప్రయోగాలతో భవిష్యత్తులో హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల వ్యవస్థ అభివృద్ధికి పునాది వేసింది. హైపర్ సోనిక్ ఆయుధాలు మాక్ 5 కంటే వేగంగా ప్రయాణించగలవు. ధ్వని వేగానికి ఐదు రెట్లు ప్రయాణించగల సామర్థ్యం ఉంది. ఆధునిక బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను ఎదుర్కోవడమే కాకుండా అణు పేలోడ్ వంటి ఆయుధ వ్యవస్థలను ఎదుర్కోవడానికి హైపర్సోనిక్ ఆయుధాలు ప్రత్యేకంగా రూపొందించారు. అణ్వాయుధాలను కలిగిన దేశాలన్నీ హైపర్ సోనిక్ క్షిపణులను ప్రవేశపెడుతున్నాయని సెంటర్ ఆఫ్ ఎయిర్ పవర్ స్టడీస్ (CAPS)లోని డాక్టర్ మన్ప్రీత్ సేథి వెల్లడించారు.
మొదటి సమస్య : ఈ క్షిపణులు సాంప్రదాయక లేదా అణు వార్‌హెడ్‌లను మోస్తాయా అనే దానిపై అస్పష్టత ఉందన్నారు. హైపర్ సోనిక్ ఆయుధాల రాకతో ప్రధానంగా మూడు సమస్యలు తలెత్తవచ్చునని సేథి అంచనా వేస్తున్నారు. అణ్వాయధాలను స్వాధీనం చేసుకున్న దేశాలలో.. ఈ రకమైన అస్పష్టత వ్యూహాత్మక స్థిరత్వానికి సమస్యాత్మకంగా ఉంటుందని సేథి చెబుతున్నారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఒక క్షిపణిని స్వాధీనం చేసుకున్న తర్వాత, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదంటున్నారు నిపుణులు.

రెండవ సమస్య.. రక్షణపరంగా తలెత్తే అవకాశం ఉంది.. ఎందుకంటే హైపర్సోనిక్ క్షిపణులతో బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అమెరికా వంటి దేశాలు ఇప్పటికే హైపర్ సోనిక్ ఆయుధాలకు కౌంటర్‌గా తమ బాలిస్టిక్ క్షిపణి రక్షణను పటిష్టపరుస్తున్నాయి.

మూడవ సమస్య : అంతరిక్ష ఆయుధీకరణకు సంబంధించిన విషయం. హైపర్సోనిక్ క్షిపణులకు ఇంటర్‌సెప్టర్లు అంతరిక్షంలో ఇంటర్‌సెప్టర్లు సెన్సార్లు రెండూ కలిగి ఉండాలి. ఎందుకంటే.. భవిష్యత్తులో యుద్ధాలు అంతరిక్షంలో జరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మాస్కో అవాన్‌గార్డ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల (ICBM) అభివృద్ధిని వేగవంతం చేసినట్లు సమాచారం. రెండు అణ్వాయుధ దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేనందున వాషింగ్టన్‌కు గణనీయమైన ముప్పు కలిగించే అవకాశం కనిపిస్తోంది.